పెంపుడు కుక్కను వదిలేయమంటే,ప్రాణాలే వదిలేసింది!

పెంపుడు జంతువుల పై చాలా మంది ప్రేమను పెంచుకుంటారు అన్న విషయం తెలిసిందే.

అయితే ఒక్కోసారి ఆ ప్రేమ హద్దులు దాటితే ఎలా ఉంటుంది అనేది ఈ తాజా ఉదంతం ద్వారా తెలుస్తుంది.

తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కను ఎక్కడైనా వదిలేసి రావాలని తండ్రి చెప్పడం తో మనస్థాపానికి గురైన 23 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ శివార్లలోని పెరియానైకెన్పాలయం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి కవిత ఓ ప్రైవేటు కంపెనీలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తుంది.

అయితే కుక్కను ఎంతగానో ఇష్టపడే కవిత ఓ కుక్కను ఇంటికి తీసుకువచ్చి రెండేళ్లుగా దాన్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుండేది.అయితే రాత్రివేళ ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తుండడం తో భయపడుతున్న ఆ మూగజీవి అరవడం ప్రారంభించింది.

Advertisement

దీనితో ఇరుగుపొరుగు వారు రాత్రి పూట ఆ కుక్క అరుపుల కారణంగా నిద్ర లేకుండా పోతుంది అని కవిత తండ్రి కి తెలపి దానిని ఎక్కడైనా వదిలి రావాలని సూచించారు.

అయితే ఇరుగుపొరుగు వారి మాటలు విన్న ఆ తండ్రి తన కూతురు కవితకు విషయం చెప్పి దాని ఎక్కడైనా వదిలేయాలని ఆదేశించాడు.అయితే తండ్రి మందలించి గట్టిగా తేల్చి చెప్పడం తో మనస్థాపానికి గురైన ఆ యువతి చివరికి ఒక సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసులు వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రపంచంలో అందరూ శాంతియుతంగా జీవించాలని, తల్లిదండ్రులు, అమ్మమ్మ, సోదరుడు తన పెంపుడు కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ కవిత రాసిన సూసైడ్ నోట్ లో కోరింది.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు