పవన్ సినిమా టైటిల్స్ పై మోజు పడుతున్న యంగ్ హీరోస్.. కొడుకుకి ఒక్కటైనా ఉండనిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.

పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో చేసినట్టు చాలా తక్కువ సినిమాలో అందులో కూడా హిట్ అయిన సినిమాల సంఖ్య కూడా తక్కువే అని చెప్పాలి కానీ ఈయన మాత్రం అభిమానులను భారీ స్థాయిలో సొంతం చేసుకున్నారు.

ఈయన సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన ఓపెనింగ్స్ మాత్రం భారీ స్థాయిలో ఉంటాయని చెప్పాలి.ఇలా తక్కువ సినిమాలకి ఈ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న క్రెడిట్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కింది.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచిగా సక్సెస్ అయినప్పటికీ ఈయన తన ఫోకస్ రాజకీయాల( Politics ) పై పెట్టారు.రాజకీయాలలో కూడా ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను తీసుకున్నారు.ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్న ఈయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారని చెప్పాలి.

ఇక పవన్ కళ్యాణ్ చేసిన సినిమా టైటిల్స్( Pawan Kalyan Movie Titles ) పై యంగ్ హీరోలు భారీ స్థాయిలో మోజు పడుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే తమ సినిమాలకు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ ఉపయోగించుకుంటున్న తరుణంలో పవన్ ఫాన్స్ స్పందిస్తూ పవన్ కొడుకు అకీరా( Akira ) కోసమైనా కొన్ని టైటిల్స్ ఉండనివ్వండి అయ్యా బాబు అంటూ కామెంట్లో పెడుతున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా( Thammudu ) టైటిల్ తో నితిన్( Nithin ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.త్వరలోనే యాంకర్ ప్రదీప్( Anchor Pradeep ) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) అనే టైటిల్ ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం తొలిప్రేమ అనే టైటిల్ ద్వారా సినిమా చేశారు.యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఖుషి అనే టైటిల్ తో సినిమా చేయడంతో పవన్ సినిమా టైటిల్స్ పై యంగ్ హీరోలంతా మోజు పడ్డారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు