యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీని రీమేక్ చేయాలని ఉంది.. ఎన్టీఆర్ బావ షాకింగ్ కామెంట్స్ !

మామూలుగా హీరో హీరోయిన్ల కెరీర్ లో సినిమాలు హిట్ అవ్వడం ప్లాప్ అవడం అన్నది కామన్.

భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు ఊహించిన విధంగా ప్లాప్ అవడం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు హిట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

అయితే వీటిలో డిజాస్టర్ సినిమాలను( Disaster movies ) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.ఆ విషయాల గురించి ఎక్కువగా కూడా చర్చించరు.

కానీ జూనియర్ ఎన్టీఆర్( Jr.NTR ) కెరియర్ లో మాత్రం ఫ్లాప్ మూవీస్ లో ఒకటైన నా అల్లుడు సినిమా ( Na alludu movie )గురించి యంగ్ హీరోలో మాట్లాడుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Young Heroes Comments On Ntr Flop Movie, Ntr, Naa Alludu, Jr Ntr, Flop Movie

వర ముళ్ళపూడి ( Vara Mullapudi )దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం నా అల్లుడు.2005లో విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాలో మురుగన్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి నవ్వులు పూజించాడు.

Advertisement
Young Heroes Comments On Ntr Flop Movie, Ntr, Naa Alludu, Jr Ntr, Flop Movie-య

ఇందులో రమ్యకృష్ణ కూడా నటించిన విషయం తెలిసిందే.సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ పాటలు మాత్రం పెద్ద హిట్ అయ్యాయి.

అయితే ఈ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేయాలని, రీ రిలీజ్ చేయాలని యంగ్ హీరోలు కామెంట్స్ చేస్తుండటం విశేషం.ఎన్టీఆర్ సినిమాని యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎంతగానో అభిమానిస్తాడనే విషయం తెలిసిందే.

Young Heroes Comments On Ntr Flop Movie, Ntr, Naa Alludu, Jr Ntr, Flop Movie

గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్స్ లో విశ్వక్ కి.ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఏది రీమేక్ చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురైంది.దానికి విశ్వక్ ఎవరూ ఊహించని విధంగా నా అల్లుడు అని సమాధానమిచ్చాడు.

ఆ సినిమా బాగుంటుందని, కొన్ని మార్పులతో బాగా తీయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ( Narne Nithin )కూడా ఈ సినిమా గురించి స్పందించారు.

ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!
ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!

నా అల్లుడు సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు.మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏ మూవీ రీ రిలీజ్ కోరుకుంటున్నారు అని ప్రశ్నకు సమాధానం ఇస్తూ.

Advertisement

నా అల్లుడు అని చెప్పాడు నితిన్.బావ పాత సినిమాల్లో నాకు నా అల్లుడు ఇష్టం.

అది అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కానీ, అందులో ఫన్ చాలా బాగుంటుంది.నా అల్లుడు రీ రిలీజ్ అయితే చూడాలని ఉంది అని నితిన్ చెప్పుకొచ్చాడు.

మరి నితిన్, విశ్వక్ సేన్ ఇద్దరిలో ఈ సినిమాను ఎవరు రీమేక్ చేస్తారో చూడాలి మరి.

తాజా వార్తలు