రాత్రి సమయంలో నిద్ర తక్కువ అయితే చక్కెర వ్యాధి వస్తుందా.. అసలు నిద్రకు ఈ వ్యాధికి సంబంధం..

ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు డయాబెటిస్ వ్యాధి ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది.

దీన్ని చాలా మంది చిన్న వ్యాధి కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు.

కానీ ఈ వ్యాధి ఎన్నో రకాల ప్రాణాంతక రోగాలను వచ్చేలా చేస్తుంది.ఇన్ఫెక్షన్ల బారిన త్వరగా పడేలా చేస్తుంది.

చాలా చిన్నచిన్న గాయాలు కూడా తగ్గకుండా పెద్ద గాయాలుగా మారేలా చేస్తుంది.కాబట్టి చక్కెర వ్యాధిని తక్కువ అంచనా అసలు వేయకూడదు.

ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి ప్రతి ఒక్కరిపై దాడి చేస్తూ ఉంది.ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాలు దాటిన వారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది.

Advertisement

కాబట్టి మూడు నెలలకు ఒకసారి మధుమేహం పరీక్షలు చేయించుకోవడం మంచిది.ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు.

అయితే చాలామంది ఈ ఆధునిక కాలంలో నిద్రకు సరైన సమయాన్ని కేటాయించడం లేదు.

నిద్రకు మధుమేహానికి మధ్య చాలా గట్టి అవినాభావ సంబంధాలు ఉన్నాయి.నిద్ర తగ్గిన కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.ఒకరోజు, రెండు రోజులు నిద్ర తగినంత మాత్రాన మధుమోహం వస్తుందని చెప్పడం లేదు.

కానీ దీర్ఘకాలంగా తక్కువ నిద్రపోతున్న వాళ్ళు అర్ధరాత్రి వరకు మేలుకోనీ ఉండే వాళ్లలో మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.నిద్రలేమి వల్ల సంతృప్తి హార్మోన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లిప్ మెడిసిన్ చెబుతున్న దాని ప్రకారం పెద్దవాళ్లు రోజుకు 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవడం మంచిది.అది కూడా రాత్రిపూట నిద్రిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.మధ్యాహ్నం రెండు గంటలు పడుకొని రాత్రి ఒక ఆరు గంటలు పడుకుంటే సరిపోతుంది అని అస్సలు అనుకోకూడదు.

Advertisement

ఏడు నుంచి ఎనిమిది గంటలు పూర్తిగా రాత్రిపూట నిద్రపోయేలా చూసుకోవడం ఎంతో మంచిది.అర్ధరాత్రి వరకు మేలుకోగా ఉండి ఆ తర్వాత ఏడు, ఎనిమిది గంటలు పడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉండవు.