మట్టితో కూడా రాఖీ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

త్వరలో రక్షాబంధన్ ( Rakshabandhan )రాబోతుంది.రాఖీ పండుగ వచ్చిందంటే.

చెల్లెళ్లు తమ అన్నలకు, అక్కలు తమ తమ్ముళ్లకు రాఖీ కడుతూ ఉంటారు.

రాఖీ కట్టినందుకు తమ చెల్లెలు, అక్కలకు సోదరులు ఏదోక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు( Eco Friendly Rakhi ) కూడా రాబోతున్నాయి.ఎకో ఫ్రెండ్లీ గణేష్ గురించి మనం వినే ఉంటాం.

అలాగే ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూసే ఉంటారు.ప్రకృతి, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఎకో ఫ్రెండ్లీ వస్తువులు తయారుచేస్తారు.

Advertisement

మట్టితో ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారుచేస్తారు.

అయితే ఇప్పుడు మట్టి రాఖీలు ( Mud Rakhis )కూడా రాబోతున్నాయి.నిజామాబాద్‌కు చెందిన శ్రీలత అనే సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లామా చేసిన యువతి వీటిని రూపొందించింది.పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి కుటుంబబాధ్యతలను చూసుకుంటున్న ఈ గృహిణికి ఏదోకటి చేయాలనే తపన ఉండేది.

దీంతో తన సృజనాత్మకతకు పదును పెట్టింది.ఇప్పటికే పలు ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారుచేసిన శ్రీలత.

త్వరలో రాఖీ పండుగ( Rakhi festival ) రాబోతున్న సందర్బంగా పర్యావరణరహితమైన టెర్రకోట రాఖీల తయారీకి శ్రీకారం చుట్టింది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

ఎర్రమట్టితో రాఖీలను తయారుచేస్తోంది.మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టి( Red clay )ని రాఖీల కోసం ఉపయోగించుకుంటోంది.మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తర్వాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్ లోకి వడబోస్తుంది.

Advertisement

దీంతో రాళ్లు, నులకలు, పుల్లలు వంటిపై జల్లెడపై ఉండిపోతాయ.ఆ తర్వాత గంటసేపు తర్వాత బకెట్ లోని నీరు పేకి తేలుతుంది.

అడుగుకు చేరిన మట్టిని ఎండబెడుతుంది.ఆ తర్వాత తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు మట్టిలో రాఖీలు తయారుచేస్తుంది.

ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలని, వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి దారాలు చుడితే రాఖీ తయారవుతుందని యువతి చెబుతోంది.

తాజా వార్తలు