సాయిరెడ్డిలో ఇంత టెన్ష‌న్ ఎప్పుడూ చూడ‌లేదు... వైసీపీ హాట్ టాపిక్ ?

వైసీపీ కీల‌క నాయ‌కుడు.ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి భ‌య‌ప‌డుతున్నారా ? ఆయ‌న‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌లు హీటెక్కిస్తున్నాయా ?  అంటే.

ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు.

ఒక‌రిద్ద‌రు నేత‌లు అత్యంత ర‌హ‌స్యంగా చేసుకుంటున్న చ‌ర్చ‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.``ప్ర‌స్తుతం విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు మా సెకండ్ బాస్ ‌(సాయిరెడ్డి) కు ప్రాణ సంక‌టంగా మారాయి.

ఆయ‌న ఇక్క‌డ స‌త్తా చూపించ‌క‌పోతే.మ‌రో నాయ‌కుడు చ‌క్రం తిప్పేందుకురెడీ అవుతున్నారు``- ఇదీ ఓ సీనియ‌ర్ నాయ‌కుడు చేసిన సంభాష‌ణ‌.

వాస్త‌వానికి విశాఖ‌లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది వైసీపీ నేత‌ల మ‌ధ్య ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న చ‌ర్చ‌.విశాఖ‌ను ఎగ్జిక్య‌టివ్ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌ధాన ప‌క్షాలైన టీడీపీ స‌హా ఇత‌రుల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

Advertisement
Vijay Sai Reddy In Tension OVer Vizag Steel Plant Issue, YCP Hot Topic,ap Vijay

ఇక్క‌డి ప్ర‌జ‌లు దీనిని కోరుకోవ‌డం లేద‌ని.విశాఖ‌ను వైసీపీ నాయ‌కులు క‌బ్జా చేస్తున్నార‌ని కూడా ఈ పార్టీల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌లే ఇవి కావడంతో ఇక్క‌డ పార్టీని గెలిపించుకుని.ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌ని నిరూపించుకునే అవ‌స‌రం వైసీపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

Vijay Sai Reddy In Tension Over Vizag Steel Plant Issue, Ycp Hot Topic,ap Vijay

ఈ నేప‌థ్యంలోనే సీఎం జ‌గ‌న్ విశాఖ బాధ్య‌త‌ల‌ను తానే స్వ‌యంగా చూస్తాన‌ని ప్ర‌క‌టించారు.అయితే సాయిరెడ్డి మాత్రం త‌‌న‌కే వ‌దిలేయాల‌ని.విశాఖ‌ను గెలిపించే బాధ్య‌త‌ను తాను చూస్తాన‌ని హామీ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల విశాఖ ఉక్కు కోసం ఆయ‌న పాద‌యాత్ర కూడా నిర్వ‌హించారు.ఇక‌, ఎన్నిక‌ల్లో కార్పొరేట్ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలోనూ అత్యంత జాగ్ర‌త్త‌లు  తీసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అంత‌టితో కూడా ఆగ‌కుండా.అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

అన్నీతానై ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్నారు.సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర‌హాలో సాయిరెడ్డి ఇక్క‌డి ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

అయితే.టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం.ఇక్క‌డి ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఆయ‌న రోడ్ షోలు నిర్వ‌హించారు.వ‌రుస‌గా ఆయ‌న భారీ ఎత్తున ప్ర‌చార స‌భ‌లు నిర్వ‌హించారు.

ఇది టీడీపీలో మంచి ఊపు తీసుకువ‌చ్చింది.విశాఖ‌లో వైసీపీకి ఎన్ని సానుకూల‌త‌లు ఉన్నా.

పార్టీలో అంత‌ర్గ‌త విబేధాలు.కొంద‌రు కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌కు తోడు.

స‌డెన్‌గా విశాఖ ఉక్కు ఉద్య‌మం లాంటివి ఎక్క‌డ దెబ్బ‌కొడ‌తాయో అన్న ఆందోళ‌న ఆ పార్టీ అధిష్టానాన్ని తీవ్రంగా క‌ల‌వ‌ర పెడుతోంది.ఇదే ఇప్పుడు విజ‌యసాయిని తెగ టెన్ష‌న్ పెట్టేస్తోంద‌ట‌.

దీంతో ఇప్పుడు ఎంపీ సాయిరెడ్డి విష‌యంపై వైసీపీలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.ఆయ‌న ఇక్క‌డ త‌న హ‌వా చూపించ‌లేక పోతే.

ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.ఇక్క‌డ చ‌క్రం తిప్పేందుకు ముఖ్య స‌ల‌హాదారు ఒకాయ‌న కాచుకుని కూర్చొని ఉన్నార‌ని వైసీపీ సీనియ‌ర్లు గుస‌గుస‌లాడు తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

తాజా వార్తలు