ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ స్వీప్‌... 74 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌.ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కు డు ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి.

ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిం చారు.జిల్లా వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పంచాయ‌తీల్లో వైసీపీ జెండా రెప‌రెప లాడించ‌డంలో పిన్నెల్లి ముందున్నారు.

నిజానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిత్తూరులోని పుంగ‌నూరు(మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం), గుంటూరులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది.

Ycp Sweep In That Constituency ... 74 Panchayats Unanimous,ap,ap Political News,

టీడీపీ ఫిర్యాదులు కూడా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఎక్కువ‌గా ఉండ‌డం, కీల‌క‌మైన నాయ‌కులు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ చ‌క్రం తిప్పుతుండ‌డంతో టీడీపీ భారీ ఎత్తున ఫిర్యాదులు చేసింది.దీనికి అనుగుణంగానే ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా దృష్టి పెట్టింది.ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా మాచ‌ర్ల‌లో పిన్నెల్లి ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని అంద‌రూ అనుకున్నారు.

Advertisement
YCP Sweep In That Constituency ... 74 Panchayats Unanimous,ap,ap Political News,

వైసీపీలోనూ ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.అయితే అనూహ్యంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని పంచాయ‌తీల‌పై పిన్నెల్లి గ‌ట్టి ప‌ట్టు సంపాయించుకు న్నారు.

మాచ‌ర్ల‌లో మొత్తం 77 పంచాయ‌తీలు ఉన్నాయి.ఆదిలో స‌గ‌మైనా వైసీపీకి ద‌క్కుతాయా? అనే సందేహాలు వ‌చ్చాయి.ఎందుకంటే టీడీపీ కూడా కీల‌క‌మైన జీవీ ఆంజ‌నేయులు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు వంటివారికి ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అయితే అనూహ్యంగా ఇక్క 77 పంచాయ‌తీల్లో 74 ఏక‌గ్రీవం అయ్యాయి.అవి కూడా పిన్నెల్లి మ‌ద్ద‌తు దారులు గంప‌గుత్త‌గా కైవ‌సం చేసుకోవ‌డం రికార్డ్‌.ఇక‌, మిగిలిన మూడు పంచాయ‌తీల‌కు శ‌నివారం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

రెంట‌చింత‌ల మండ‌లంలోని పాలువాయి, దుర్గి మండ‌లంలోని ధ‌ర్మ‌వ‌రం పంచాయ‌తీల్లో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ద్ద‌తు దారులు నువ్వా-నేనా అనేరేంజ్‌లో త‌ల‌ప‌డుతుండ‌డం మాత్రం గ‌మ‌నార్హం.ఇక‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులో నూరుశాతం పంచాయ‌తీలు అంటే 83కు 80(మూడు చోట్ల అభ్య‌ర్థులు లేరు) ఏక‌గ్రీవాలైతే పిన్నెల్లి నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌లో 77కు 74 ఏక‌గ్రీవాలు చేసుకుని త‌న స‌త్తా చాటారు.

ఇది ప్ర‌స్తుతం వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు