మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!

ఏపీ ఎన్నికల గెలుపు విషయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) నాయకులు చాలా ధీమాగా ఉన్నారు.2019 ఎన్నికలలో గెలిచిన స్థానాల కంటే అత్యధికంగా గెలుస్తామని ఇటీవల ఆ పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పోలింగ్ అనంతరం ఓ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వైఎస్ జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను నిత్యం ప్రజలలో ఉంచుతూ రకరకాల పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.గడపగడపకు మన ప్రభుత్వం, సామాజిక బస్సు యాత్ర.ఈ రకంగా కొన్ని కార్యక్రమాల ద్వారా తన పాలనలో జరిగిన మంచిని ప్రజలకు స్థానిక నేతల ద్వారా తెలియజేశారు.

అదే సమయంలో పలు సర్వేలు చేయించుకుని ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను పక్కనపెట్టి మిగతా వారికి టికెట్లు కేటాయించారు.సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి వైయస్ జగన్ మెగా పూర్తిగా ప్రజలలోకి రావడం జరిగింది.సిద్ధం, మేమంతా సిద్ధం( Memantha Siddham ) వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతో వైసీపీ క్యాడర్ చాలా ఉత్సాహంగా ఈ ఎన్నికలలో పాల్గొనడం జరిగింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు( Welfare Schemes ) అందించటంతో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని వైసీపీ భావిస్తుంది.

Advertisement

జగన్ తన ఎన్నికల ప్రచారంలో మంచి జరిగితేనే ఓటేయండి అని చాలా డిఫరెంట్ గా స్పీచ్ లు ఇచ్చారు.ఈ క్రమంలో రూరల్ మరియు మహిళా ఓటింగ్ ఈసారి ఎక్కువగా ఉండటంతో రామే గెలుస్తామని వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం విశాఖపట్నంలో ( Vishakapatnam ) రెండోసారి సీఎంకు జగనన్న ప్రమాణ స్వీకారం మహోత్సవం.

జూన్ 4 నుంచి సంబరాలకి సిద్ధం అవ్వండి అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు