వైసీపీ ఎంపీ పై ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు..!!

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి ఫిర్యాదు చేయడం జరిగింది.

వైయస్ జగన్ కి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తే అంతు చూస్తానంటూ పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీ గోరంట్ల మాధవ్ తనని బెదిరించినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ఢిల్లీ లో మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు.పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలందరూ ముందు తనపై గోరంట్ల మాధవ్ దుర్భాషలాడరని స్పష్టం చేశారు.

Ycp Rebel Mp Raghuram Krishna Raju Complains Against YCP MP ,Raghuram Krishna Ra

అదే సమయంలో బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారని.తాను ఆ టైంలో సమయం పాటించినట్లు, తర్వాత లోక్సభ స్పీకర్ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

అంత మాత్రమే కాక తనను ఎదిరించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ సెంట్రల్ హాల్ సీసీ కెమెరాల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే గోరంట్ల మాధవ్ హావభావాలు ఏంటో ఇట్టే అర్థమై పోతాయి అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

Advertisement

కావాలని గోరంట్ల మాధవ్ తో జగన్.మాట్లాడిన చాడా లేకపోతే జగన్ ని మంచిగా చేసుకోవడానికి ఆయన మాట్లాడారో తెలియలేదని రఘురామకృష్ణంరాజు మీడియా ముఖంగా తెలిపారు.

ఈ విషయంలో స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారని, అక్కడ న్యాయం జరగకపోతే ప్రధాని మోడీ కి ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు