వైసీపీ రాళ్ల దాడి చేసేందుకు వ్యూహాం పన్నింది..: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రేపు పెడన నియోజకవర్గంలో నిర్వహించే వారాహి విజయ యాత్రపై రాళ్ల దాడి జరగనుందని ఆరోపించారు.

వారాహి యాత్రపై, తనపై కొందరు వైసీపీ వ్యక్తులు దాడికి వ్యూహాం పన్నారన్న సమాచారం అందిందని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ క్రమంలో రేపు పెడనలో దాడి జరిగితే హోంమంత్రి, డీజీపీదే బాధ్యతని చెప్పారు.

జగన్ పులివెందుల రౌడీయిజం చూపిస్తే చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.క్రిమినల్ వేషాలు వేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.

వైసీపీ వాళ్లు రెచ్చగొట్టినా జన సైనికులు ఎవరూ ఎదురు దాడికి దిగవద్దని జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఎవరైనా కర్రలు, కత్తులు తీసుకువస్తే వారిని బంధించాలని సూచించారు.

Advertisement

అనంతరం అటువంటి వారిని పోలీసులకు అప్పగించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు