విజయసాయిరెడ్డి కొత్త ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం వెనుక కారణమేంటో తెలుసా?

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షంపై చేస్తున్న ఆరోపణలపై తనదైన శైలిలో ఫైర్ అవుతుంటారు.

అందుకే ఆయనకు జగన్ పార్టీలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు.

పార్టీలో అంత కీలక నేత అయిన విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఓ పని ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

Reason Behind YCP MP Vijay Sai Reddy New Twitter, Vijay Sai Reddy Opened New Twi

విజయసాయిరెడ్డి తనకు ఆల్రెడీ ట్విట్టర్ లో ఓ ఖాతా ఉన్నప్పటికీ తాజాగా మరో ట్విట్టర్ ఖాతాను తెరిచారు.ఆల్రెడీ ట్విట్టర్ ఖాతా ఉన్నప్పుడు మరి ఇంకో ట్విట్టర్ ఖాతాను ఎందుకు తెరిచారు? అనే చర్చ ఉదయం నుండి సోషల్ మీడియాలో జరగుతుంది .అసలు విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి సరికొత్త ట్విట్టర్ ఖాతా ద్వారా వినతిపత్రాలు,ఫిర్యాదులు తీసుకుంటారట.ఇందులో పాలిటిక్స్ కు సంబంధించిన ప్రస్తావన అసలు ఉండబోదని ఆయన అన్నారు.

గ్రామ సచివాలయాలలో, నియోజకవర్గలలో సమస్యలు, ప్రభుత్వ పథకాలు అందకపోవడం లేదా నిధానంగా వాటి ప్రతిఫలాలు లభించడం వంటి అంశాలపై ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు ఫిర్యాదులను తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఈ సరికొత్త ట్విట్టర్ ఖాతాను తెరిచినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Advertisement
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

తాజా వార్తలు