చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు..!!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 13వ తారీకు చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా రిలీజ్ కావటం తెలిసిందే.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.

యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీలో చిరంజీవి మరియు రవితేజ కలిసి అద్భుతంగా నటించి అభిమానుల ఆదరణ దక్కించుకున్నారు. అన్నదమ్ముల సెంటిమెంట్ కలిగిన ఈ "వాల్తేరు వీరయ్య" కథ చూసే ప్రేక్షకుడని ఎంతగానో ఆకట్టుకుంది.

YCP MP Raghuramakrishna Raju Congratulated Chiranjeevi YCP MP , Raghuramakrishn

పైగా చాలా కాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించడంతో ఈ సినిమాకి భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు.సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.

కలెక్షన్స్ కుమ్మేస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు.ఈ సందర్బంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు "వాల్తేరు వీరయ్య" బ్లాక్ బస్టర్ హిట్ అయిందని తెలిపారు.

Advertisement

ప్రతి ఒక్కరు బాస్ ఇజ్  బ్యాక్ అంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు."నా ఫ్రెండ్ చిరంజీవికి, నా కజిన్ రవితేజకు, చిత్ర దర్శకుడు బాబీకి, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కీ.యావత్ చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రఘురామకృష్ణరాజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఆయిల్ స్కిన్‌ను దూరం చేసే సింపుల్ టిప్స్‌!
Advertisement

తాజా వార్తలు