ముందస్తు ఎన్నికల వార్తల పై స్పందించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!!

దేశంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సైతం కార్యకర్తలకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వారాహి విజయ యాత్ర తొలిదశలో కూడా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సైలెంట్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని అన్నారు.త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అందులో తెలంగాణ కూడా ఉంది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికలకు వెళ్తుందని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో సైతం ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( P.V.Midhun Reddy ) క్లారిటీ ఇచ్చారు.తమకి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెలియజేశారు.

Advertisement

ఇదే సమయంలో ఐదేళ్ల కాలంలో ఒక రోజున కూడా వదులుకోమని వ్యాఖ్యానించారు.రాష్ట్రానికి రావలసిన నిధుల కోసమే మోడీ మరియు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్( CM jagan ) కలిసినట్లు స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరోజు ముందు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని మిథున్ రెడ్డి తెలియజేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు