వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరారు.

ఈ మేరకు గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండానే ప్రకటించారని తెలిపారు.ఈ క్రమంలోనే పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా నియోజకవర్గానికి వెళ్లానన్నారు.

అయితే వారం రోజులకే సర్వేలు తనకు వ్యతిరేకంగా రావడంతో ఆగిపోమన్నారన్నారు.కొన్ని రోజుల తరువాత తననే పోటీ చేయాలని చెప్పిన పార్టీ అధిష్టానం సుచరితను తాడికొండ ఇంఛార్జిగా నియమించిందని వాపోయారు.

Advertisement

ఎవరైనా జగన్ ఆదేశాలను పాటించాల్సిందేనన్న ఆయన జగన్ ను కలిసేందుకు తనకో అవకాశం ఇవ్వాలని కోరారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement