వాళ్లు విజయసాయిరెడ్డికి ఓటేయ్య‌ర‌ట‌

జ‌గ‌న్ ఎన్ని హుకుంలు జారీ చేసినా, నిర్భంధాల‌కు గురి చేసినా ఆత‌ని మాట వినే ప‌రిస్థితి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేద‌ని ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ వ్యాఖ్యానించారు.

సోమ‌వారం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుని క్యాంపు కార్యాల‌యంలో క‌లుసుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.

విజయసాయిరెడ్డికి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌టం ప‌ట్ల వైకాపాలో తీవ్ర వ్యతిరేక‌త నెల‌కొని ఉంద‌ని, ఇప్ప‌టికే ఈ విష‌య‌మై త‌న‌తో మాట్లాడార‌ని చెప్పారు.వైకాపాలో జ‌గ‌న్ నియంతృత్వ ధోర‌ణి ప‌ట్ల విసిగి వేసారిన ప‌లువురు శాస‌న స‌భ్యులు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని, ప్ర‌జా స్వామ్య యుతంగా ఉన్న తెలుగుదేశంలోనికి రావాల‌ని అనుకుంటున్నార‌ని, జలీల్‌ ఖాన్ పేర్కొన్నారు ఈ విషయంపైనే ముఖ్య‌మంత్రితో మాట్లాడారా అన్న ప్ర‌శ్న‌కు ఏ జ‌ర‌గ‌బోతోందో మునుముందు చూడండ‌ని చెప్పారాయ‌న‌.

కేవ‌లం విహార యాత్ర కోస‌మే వెళ్తున్న‌ట్టు ప‌లువురు త‌న‌కు చెప్పార‌ని, వారు ఎక్క‌డికి వెళ్లినా రాజ్య‌స‌భ ఎన్నిక‌లో్ల తెలుగుదేశం అభ్య‌ర్ధుల‌కే ఓటు వేయ‌నున్నార‌ని, జ‌గ‌న్ ఎన్ని తంటాలు ప‌డ్డా విజయసాయిరెడ్డి ఓట‌మి ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు జ‌లీల్‌ఖాన్‌.

పేదల కోసం టిమ్స్ ఆసుపత్రులు నిర్మించిన కేసీఆర్ : కేటీఆర్
Advertisement

తాజా వార్తలు