వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హీట్ పెంచుతున్నాయి.

తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని కోటంరెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మరోసారి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఫోన్ ట్యాపింగ్ తో తన కాల్స్ ను దొంగతనంగా విన్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు.

జగన్, సజ్జల లాంటి వాళ్లు చెప్పకుండా ఇది జరుగుతుందా అని ప్రశ్నించారు.నాయకుడే నమ్మకపోతే తాను పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటని వాపోయారు.

ఈ వ్యవహారంపై కనీసం సంజాయిషీ కూడా అడగరా అని నిలదీశారు.తన జీవితంలో ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు.

Advertisement

వైసీపీకి తను వీర విధేయుడినని అందరికీ తెలుసన్న ఆయన పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని తెలిపారు.కానీ వైఎస్ మీద ఉన్న ప్రేమతో ఎన్నో భరించానని పేర్కొన్నారు.

అనంతరం తాను ఎక్కడా వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు