ఆ వైసీపీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్క‌య్యారా...?

టీడీపీ కంచుకోట‌లో వైసీపీని ప‌రుగులు పెట్టించి.విజ‌యం ద‌క్కించుకునేలా చేసిన వైసీపీ నేత‌లు.

ఏడాదిన్న‌ర‌కాలంలోనే త‌మ దూకుడును త‌గ్గించ‌డంతోపాటు.చాలా మంది నాయ‌కులు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.

ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి కూడా ఉన్నార‌ని స్థానికంగా వ్యాఖ్య‌లు విని పిస్తున్నాయి.ముఖ్యంగా రెండు సార్లు ఇక్క‌డ నుంచి టీడీపీ గెలిచినా.

మూడోసారి.వైసీపీకి ఇచ్చామ‌ని.

Advertisement
YCP MLA Kasu Mahesh Reddy In Illegal Activities, YCP MLA Kasu Mahesh Reddy, TDP

మ‌రి ఈ పార్టీ వ‌ల్ల త‌మ‌కు ఒరిగినదేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే స్థానిక ఎమ్మెల్య‌తో తాము వేగ‌లేక పోతున్నామ‌ని చెబుతున్నారు.

టీడీపీ హ‌యాంలో నియోజకవర్గానికి 15 వేల ఇళ్లు, 20 వేల మందికి పట్టాలు ఇచ్చినా.ఇప్ప‌టి వ‌ర‌కు కాసు హ‌యాంలో ఒక్క ఇల్లు అయినా శాంక్షన్ చేయించారా ? అనేది ఇక్క‌డి వారి ప్ర‌శ్న‌.పట్టాలిస్తాం.

పేద‌ల‌కు ఇళ్లిస్తామ‌ని చెప్పిన నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు స్పందించ‌లేద‌ని అంటున్నారు.పేద‌ల ఇళ్ల‌లో స్తానికంగా అనేక అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయి.

తక్కువ ధరకు భూమి కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు.కోట్ల రూపాయల అవినీతి సొమ్ము చేతులు మారుతోంద‌ని కూడా పెద్ద ఎత్తున విమర్శ‌లు వ‌స్తున్నాయి.

Ycp Mla Kasu Mahesh Reddy In Illegal Activities, Ycp Mla Kasu Mahesh Reddy, Tdp

నియోజకవర్గంలో ఈ సంవత్సరన్నర కాలంలో వంద రూపాయల పని కూడా చెయ్యకపోవ‌డం స‌రికాదనేది మేధావుల మాట‌గా కూడా వినిపిస్తోంది. పేకాట క్లబ్బులు, అక్రమ మైనింగ్, అక్రమ మద్యం, సారా, గుట్కాలు, బియ్యం రీసైక్లింగ్, మట్టి, ఇసుకవంటి అనేక వాటిలో అక్ర‌మాలు సాగుతున్నాయ‌ని.స్థానిక మేధా వి వ‌ర్గం పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తోంది.మెడికల్ కాలేజీ భూముల్లో రూ.20 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారంటూ.స్థానిక వైసీపీ నేత‌ల‌పైనా వీరు విమ‌ర్శ‌లు గుపిస్తున్నారు.

Advertisement

 మొత్తంగా చూస్తే.ఎమ్మెల్యే కాసుకు ఈ ప‌రిణామాలు సెగ పెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు