విశాఖ గర్జన పక్కదారి పట్టించడానికి చంద్రబాబు డైరెక్షన్లో పవన్ యాక్టింగ్ చేశాడు - కరణం ధర్మశ్రీ

అనకాపల్లిలో కరణం ధర్మశ్రీ మీడియా సమావేశం.విశాఖ గర్జన సక్సెస్ అయ్యింది.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పారద్రోలడానికి ప్రజలు స్వచ్ఛందంగా గర్జనలో పాల్గొన్నారు.

గర్జన సక్సెస్ పక్కదారి పట్టించడానికి చంద్రబాబు డైరెక్షన్లో పవన్ విశాఖలో యాక్టింగ్ చేశాడు.

Ycp Mla Karanam Dharmasri Comments On Vishaka Garjana Success Details, Ycp Mla K

పవన్ ను గాజువాక ప్రజలు తిరస్కరించారని కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు.పవన్ వెనుక సినిమా పిచ్చోళ్ళు, బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు.

ఈనెల 21వ తేదీన అనకాపల్లిలో పెంటకోట కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నది.ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో గల ఏడు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగి జేఏసీ సబ్ కమిటీలు ఏర్పడటం జరిగింది.

Advertisement

ఈనెల 21వ తేదీన అనకాపల్లిలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ తో పాటు మంత్రులు బొత్స, ధర్మాన, అమర్, ముత్యాల నాయుడులు పాల్గొంటారు.విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తూ రైతుల ముసుగులో వస్తున్న పాదయాత్రను శాంతియుత మార్గంలో తిప్పి కొట్టాలి.

ఉత్తరాంధ్ర ఉద్యమ సెగ పాదయాత్రకు వచ్చిన వారికి తగిలి వాళ్లు అంతట వాళ్లే పాదయాత్ర విరమించుకొని వెనక్కి వెళ్లేలా చేయాలి.విశాఖ రాజధాని వచ్చేవరకు నియోజకవర్గాల వారిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాను.

Advertisement

తాజా వార్తలు