ముసలి నక్క, యువ నక్క అంటూ విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు

వైకాపా ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి నేడు వైజాగ్‌లో పర్యటించాడు.ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలో పాల్గొన్నాడు.

ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.వీరిద్దరిని నక్కలతో పోల్చుతూ విజయసాయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ఈ అయిదు నెలల్లో జగన్‌ చేసిన అభివృద్ది మరియు ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి ఒక ముసలి నక్క మరియు ఒక యువ నక్క తట్టుకోలేక పోతున్నాయి.ముసలి నక్క వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ఆ నక్క తన తర్వాత యువ నక్క ఏదైనా సాధిస్తుందా లేదా అనే అనుమానంతో ఉంది.ఈ రెండు నక్కలు కూడా జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయి అంటూ చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

ఇన్నాళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు.ఇప్పుడు ఆయన తనయుడు కూడా జగన్‌ బాబును విమర్శిస్తున్నాడు అంటూ ఎద్దేవ చేశాడు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement