మరోసారి అస్వస్థతకు గురైన వైసీపీ మంత్రి..!!

వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలో అస్వస్థతకు గురవడం తెలిసిందే.ఆ సమయంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో యాంజియోగ్రామ్ చేయించుకోవడం జరిగింది.

వైసీపీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ప్రసంగించిన అనంతరం.తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అప్పట్లో జాయిన్ అయ్యి.

ట్రీట్మెంట్ చేయించుకున్నారు.అయితే తాజాగా నేడు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.

మార్కాపురం లోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీ లో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తుండగా మంత్రి.లోబిపి ఆయాసంతో బాధపడ్డారు.

Advertisement

వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ కావటంతో జార్జి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లోనే.మంత్రి ఆది మలపు సురేష్ కి.వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బీపీ హెచ్చుతగ్గుల వల్ల వాకింగ్ చేస్తున్న సమయంలో.

కింద పడి పోవడం జరిగింది.దీంతో కళాశాలలోనే ప్రస్తుతం మంత్రి సురేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు