సందిగ్ధంలో జనసేన శ్రమదానం.. సర్కారు అనుమతి నిరాకరణ..!

గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న జనసేన ఆధ్వర్యంలో జరగనున్న శ్రమదానాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది.

అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్న రెండు జిల్లాల్లోనూ శ్రమదానం జరగకుండా చెక్ పెట్టడానికి కార్యచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ పై శ్రమదానానికి బ్యారేజ్ సీఈ అనుమతి నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అడ్డుకున్న విధంగానే పవన్ విషయంలోనూ ఆ తరహా వ్యూహాన్ని అనుసరించాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ పై వైసీపీ మార్క్ రాజకీయం కొనసాగుతుందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.రాజకీయాలంటే ఎలా ఉంటాయో మున్ముందు చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ కు రాజకీయం అంటే ఇలా ఉంటుందని చూపించే ప్రయత్నాలలో వైసీపీ ఉంది.

అందులో భాగంగా పవన్ కు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది.ఆయన ప్రణాళికను భగ్నం చేసే పనులు వైసీపీ పడింది.

Advertisement

జగన్ ప్రభుత్వం పై దండయాత్ర మొదలు పెట్టాలని పవన్ సంకల్పిస్తే.ఆ దండయాత్రను అడ్డుకోవడానికి సర్కార్ ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీలా కొనసాగుతున్న సమయంలో పవన్ ను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది.పవన్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మున్ముందు.

వైసీపీ సర్కార్ పై ఏ విధంగా యుద్ధం చేస్తాడు అని అందరూ భావిస్తూంటే.పవన్ నిలువరించాలని వైసీపీ వ్యూహం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది.

ఇటీవలే రాష్ట్రంలో రోడ్ల అధ్వానంగా ఉన్నాయని.గుంతల మయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ వినూత్న నిరసనలతో దిగింది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసేలా ప్రసారం చేసింది.అంతే కాకుండా ఇదే సమయంలో ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చింది.నాలుగు వారాల గడువు ఇచ్చి వాటికి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

అయినా ప్రభుత్వం స్పందించకపోవడం తో ఇంతకాలం నిరీక్షించిన జనసేన అక్టోబర్ 2వ తేదీన నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారని ప్రకటించింది.గాంధీ జయంతి  నాడు ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ పైన.మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద శ్రమదానం చేయనున్నట్లు పేర్కొంది.కాటన్ బ్యారేజ్ రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి రాదని పేర్కొన్నారు.

కేవలం మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ఇరిగేషన్ ఎస్ఈ వెల్లడించారు.

అంతే కాదు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా  పూడ్చితే బ్యారేజ్ కి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధవళేశ్వరం బ్యారేజ్ పై శ్రమదానానికి చేయడానికి అనుమతి కుదరదని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది.కావాలనే  వైసీపీ అవాంతరాలు సృష్టించిందని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా పవన్ శ్రమదానం చేసి తీరుతారని తేల్చి చెబుతున్నారు.మరోవైపు సమాధానం లో భాగంగా అనంతపురం లో కూడా పవన్ పర్యటన ఉన్న కారణంగా రోడ్లు మరమ్మతు కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది.

అనంతపురం జిల్లా కొత్త చెరువు లో రోడ్డు మరమ్మతు పనులు పూర్తిచేసి పవన్ కళ్యాణ్ ప్లాన్ భగ్నం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుంది.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి మరి.

తాజా వార్తలు