టీడీపీ జనసేన పొత్తు పై వైసీపీ అలెర్ట్ ! అందుకే ఇలా ? 

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 స్థానాలను గెలిచి తీరాలనే పట్టుదలతో ఏపీ అధికార పార్టీ వైసీపీ ఉంది.

దీనిలో భాగంగానే వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్ పార్టీ నాయకులకు అనేక టాస్క్ లు ఇస్తున్నారు.

అంతేకాదు వైసిపి ప్రజాప్రతినిధులు అంతా నిత్యం జనాల్లో ఉండేలా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని చేస్తున్నారు.ఈ విధంగా ఎన్ని కార్యక్రమాలు జగన్ అమలు చేస్తున్నా.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి,  జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాలనే విషయాన్ని జగన్ గ్రహించారు.టిడిపి జనసేన కలిస్తే  తమకు గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని జగన్  అంచనా వేస్తున్నారు.

దీనిలో భాగంగానే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా వీలైనంత దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు .టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తే కనీసం 50 స్థానాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.

Advertisement

2019 ఎన్నికల్లోను జనసేన టిడిపిలు విడిగా పోటీ చేయడం ద్వారానే వైసిపికి 151 స్థానాలు వచ్చాయి.అదే జనసేన టిడిపి కలిసి పోటీ చేసి ఉంటే కనీసం 60 స్థానాల్లో ఆ రెండు పార్టీలు విజయం సాధించేవి.ఆ విషయాన్ని గ్రహించే టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో,  ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా అలర్ట్ అయింది.

ఈ రెండు పార్టీల మధ్య దూరం పెంచే విధంగా మీడియా,  సోషల్ మీడియా ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది.జనసేన , టిడిపి మధ్య చిచ్చుపెట్టే విధంగా నందమూరి మెగా అభిమానుల మధ్య విభేదాలు తీసుకురావడంతో పాటు,  కమ్మ,  కాపు సామాజిక వర్గాల మధ్య వైరం పెరిగాల ప్రయత్నాలు చేస్తుంది .అలాగే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య మరింత దూరం పెరిగే విధంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.సరిగ్గా ఇదే సమయంలో టిడిపి అనుకూల మీడియా గా పేరు పొందిన ఓ ఛానల్ అధినేత పవన్ పై ప్యాకేజీ ఆరోపణలు చేస్తూ కథనాన్ని ప్రచారం చేయడాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది .

ఎప్పుడు పవన్ ను తిట్టు పోసే మంత్రి రోజా సైతం పవన్ కు మద్దతుగా టిడిపిపై విమర్శలు చేశారు.లోకేష్ పాదయాత్ర ఫెయిల్ కావడంతోనే వారాహితో పవన్ బస్సు యాత్ర చేస్తే ఎక్కడ సక్సెస్ అవుతుందోనని ఆయన పై ఈ విధంగా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారనే విధంగా రోజా మాట్లాడారు.అంతేకాదు రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు పెట్టుకున్న పవన్ ముఖ్యమంత్రి పదవి విషయంలో పట్టు పట్టకుండా ముందు నుంచే ఆయన ఈ విధంగా కంట్రోల్ చేస్తూ, ఆయన ప్రభావం అంతంత మాత్రంగా ఉండేలా చేస్తున్నారనే విధంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ,  చంద్రబాబుతో ఎప్పటికైనా పవన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అనే విధంగా  మాట్లాడుతూ,  టిడిపి పై జనసేనకు విరక్తి కలిగే విధంగా వైసిపి ప్రయత్నాలు చేస్తోంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు