టీడీపీ మోత మోగిందా.. తుస్సుమందా ?

టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు( TDP Chandrababu Naidu ) జైలుపాలు అయిన తరువాత.

ఆయన అరెస్ట్ ను ఎలా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనే టీడీపీ శ్రేణులు( TDP Activists ) మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధినేత అరెస్ట్ వల్ల ఎలాంటి నష్టం జరకుండా చూసుకుంమెందుకు, టీడీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్ చేశారనే భావనను ప్రజల్లో కలిగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ నేతలు చేపడుతున్న ఆందోళనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.

కాగా చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) ను నిరసనగా ఇటీవల మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలుగు దేశం పార్టీ నేతలు.రాష్ట్రంలోని ప్రలంతా జంద్రబాబుకు మద్దతుగా ఇళ్ల లోనుంచి బయటకు వచ్చే ఏదో ఒక విధంగా శబ్ధం చేయాలని కోరారు.ఆ శబ్ధలు సి‌ఎం జగన్ కు వినపడేలా మోత మోగించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.

Advertisement

అయితే ఈ కార్యక్రమం పట్ల వైసీపీ శ్రేణులు( YCP Leaders ) సైటర్లు కురిపిస్తున్నారు.మోత మోగించినంత మాత్రాన ఆధారాలు తారుమారు కావని చెబుతున్నారు.పక్కా ఆధారాలతోనే చంద్రబాబు స్కామ్ బయటపడిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం స్కిల్ స్కామ్ విచారణ( Skill Development Scam ) హోల్డ్ లో ఉండగా ఈ నెల 3 న విచారణ జరిగే అవకాశం ఉంది.మరోవైపు నారా లోకేశ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది.ఈ నేపథ్యంలో టీడీపీలో నాయకత్వ లోపం ఏర్పడడంతో ఆ పార్టీ నేతలు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

అందుకే మోత మోగిద్దాం అంటూ హాస్యాస్పద కార్యక్రమాలు చేస్తున్నారని సెటర్లు వేస్తున్నారు.టీడీపీ వాళ్ళు ఎంత మోత మోగించిన శబ్దం రాదని ఎందుకంటే వారు స్కామ్ లే పార్టీని ముంచయని విమర్శలు గుప్పిస్తున్నారు కొంతమంది.

ఇక ముందు రోజుల్లో టీడీపీ ఇంకెలాంటి కార్యక్రమాలు చేపడుతుందో చూడాలి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు