రజనీ అభిమానులు కాలర్ ఎగరవేసుకునేలా ఉన్న ఈ ఫోటోను చూస్తే మీకు విషయం ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.రజనీకాంత్( Rajinikanth ) యవ్వనంలో ఉన్నప్పటి ఈ ఫోటోలో ఉన్న మాదిరిగానే అతడి మనవడు యాత్ర కూడా అచ్చుగుద్దినట్టుగా తాత పోలికలతోనే ఉన్నాడు.
,/br>
రజనీకాంత్ కి వారసులు లేరు అనే బాధ ఈరోజు లేకపోయినప్పటికీ ఆయన అభిమానులకు మాత్రం ఒక కొడుకు ఉండి ఉంటే కచ్చితంగా ఈరోజు అయ్యుండే వాడని అనుకుంటూ ఉంటారు.కానీ ఆయనకు ఐశ్వర్య, సౌందర్య ( Aishwarya, Soundarya )ఇద్దరు అమ్మాయిలే పుట్టడంతో ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.అయితే సౌందర్య ఐశ్వర్య ఇద్దరు కూడా ఎంతో టాలెంట్ ఉన్నవారే మరి స్టార్ కిడ్స్ లాగా స్పాయిల్ కాకుండా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారు.
రజనీకాంత్ కుమార్తె సౌందర్య విషయానికి వస్తే ఆమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు కాక ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకొని 2019లో మరో వివాహం చేసుకుంది ఈమెకు ఇద్దరు పిల్లలు.ఇక ఆమె వృత్తి విషయాలకు వస్తే సౌందర్య గ్రాఫిక్ డిజైనర్ ( Graphic designer )గా చాలా సినిమాలకే పని చేశారు.డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా కూడా ఆమె కనిపించడం విశేషం చివరగా ఆమె డైరెక్షన్ చేసిన సినిమా వెలాయిల్ల పట్టాధారి 2.రజినీకాంత్ మరొక కూతురు ఐశ్వర్య.ఈమె హీరో ధనుష్ మాజీ భార్య వీరికి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం ఐశ్వర్య కు ధనుష్ తో విడాకుల వ్యవహారం నడుస్తోంది.
ఐశ్వర్య కూడా దర్శకురాలిగా మారి నాలుగు సినిమాలు తీయగా ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లాల్ సలాం అనే చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.కేవలం దర్శకురాలిగా మాత్రమే కాదు ఆమె సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని చిత్రాలకు పని చేశారు.ఇక ఐశ్వర్య ఇద్దరు కొడుకులు లింగ( linga ) మరియు యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఐశ్వర్య పెద్ద కొడుకు యాత్ర రాజా( yatra raja ) తాత రజనీ పోలికలతో ఉన్నాడు.యాత్ర సైతం తండ్రి, తాత, తల్లి వారసత్వం తీసుకొని సినిమాల్లోకి వచ్చి హీరోగా ఒక వెలుగు వెలగాలని రజనీకాంత్ అభిమానులంతా కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy