సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలను లైన్లో పెట్టి వాటిని పూర్తి చేసుకుంటూ వస్తుంది.
మరి ఈమె నటించిన లేటెస్ట్ సినిమాల్లో యశోద సినిమా ఒకటి.
ఈ సినిమా కోసం సామ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ క్రమంలోనే ఈ రోజు మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.
అయితే ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు వేశారు.మరి ఈ ప్రీమియర్స్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించు కున్నట్టు తెలుస్తుంది.60 వేల డాలర్స్ కి పైగానే యశోద యూఎస్ ప్రీమియర్స్ కు రాబట్టినట్టు టాక్.మొత్తానికి సామ్ కష్టం వృధా అవ్వలేదు.
ఈ సినిమా మంచి టాక్ తో సాలిడ్ హిట్ అందుకుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయం సాధించడం ఖాయం.యశోద సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.
ఈ సినిమాతో హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు మంచి విజయం సాదించేలాగానే కనిపిస్తుంది.
ఇక సమంత ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అని టాక్.అలాగే ఎప్పటి లాగానే ఈమె తన నటనతో సినిమాకు వెన్నెముక గా నిలిచి హిట్ అవ్వడంతో కీలక పాత్ర పోషించింది.ఒకవైపు సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతున్న కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
ఈమె ఆ స్థితిలో కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం సినిమా ఓపెనింగ్స్ బాగా రావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చూడాలి తెలుగులో ఈ సినిమా ఎలా రాణిస్తుందో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy