యశస్వి జైస్వాల్ సెంచరీతో సరికొత్త రికార్డు.. ఒక్క సెంచరీ తో బద్దలైన పలు రికార్డులు ఇవే..!

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్-వెస్టిండీస్( India-West Indies ) మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal )ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన సెంచరీ సాధించి ఓ సరికొత్త రికార్డు ఖాతాలో వేసుకొని అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

143 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ మరో 45 పరుగులు చేస్తే, భారత్ తరపున ఆరంగేట్రం చేసిన తొలి టెస్ట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత జట్టు బ్యాటర్ గా సరికొత్త రికార్డు ఖాతాలో పడుతుంది.

భారత తరఫున టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan )187 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 177 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.143 పరుగులతో ఉన్న యశస్వి జైస్వాల్ మరో 57 పరుగులు చేస్తే ఆరంగేట్రం చేసిన తొలి టెస్ట్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర కెక్కే అవకాశం ఉంది.వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.యశస్వి జైస్వాల్ 143 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

Advertisement

కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )సెంచరీ తో అదరగొట్టి పెవిలియన్ చేరాడు.విరాట్ కోహ్లీ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

యశస్వి జైస్వాల్ ఖాతాలో పడ్డ సరికొత్త రికార్డులు ఇవే: భారత తరఫున డెబ్యూ టెస్టులో సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా, మూడవ ఓపెనర్ గా, విదేశాల్లో టెస్ట్ లో ఆరంగేట్రం చేసిన తొలి భారత ఓపెనర్ గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.విదేశాల్లో ఆరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన 5వ భారత క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు.ఆరంగేట్రం టెస్టులో సెంచరీ బారిన నాలుగవ యంగెస్ట్ భారత క్రికెటర్ గా నిలిచాడు.91 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై భారత జట్టు తరఫున ఆరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఎస్ ఎస్ విజయ్ రికార్డ్ సృష్టించాడు.

Advertisement

తాజా వార్తలు