టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్..!

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో ( Asian Games )భాగంగా భారత్- నేపాల్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి సెమీఫైనల్ చేరింది.

అయితే ఇప్పటివరకు ఏ భారతీయ బ్యాట్స్మెన్ సాధించలేని రికార్డ్ ను యశస్వి జైస్వాల్ సాధించాడు.

తన తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్ లతో సెంచరీ నమోదు చేశాడు.

Yashasvi Jaiswal Created A New History In T20 , Yashasvi Jaiswal, Sports , T20

దీంతో టి20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడైన బ్యాట్స్మెన్ గా యశిస్వి జైస్వాల్( Yashasvi Jaiswal ) నిలిచాడు.దీంతో శుబ్ మన్ గిల్ సాధించిన రికార్డ్ బద్దలు కొట్టాడు.ఈ ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టీ20 అంతర్జాతీయ క్రికెట్లో గిల్ ( Shubman Gill )తన తొలి సెంచరీ సాధించాడు.

అప్పుడు గిల్ వయసు 23 సంవత్సరాల 146 రోజులు.తాజాగా సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ వయస్సు 21 సంవత్సరాల 279 రోజులు.

Yashasvi Jaiswal Created A New History In T20 , Yashasvi Jaiswal, Sports , T20
Advertisement
Yashasvi Jaiswal Created A New History In T20 , Yashasvi Jaiswal, Sports , T20

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నేపాల్ ముందు ఉంచింది.భారత జట్టు బ్యాటర్లైన యశస్వి జైస్వాల్ సెంచరీ తో అదరగొట్టాడు.

భారత జట్టు కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ 25, శివం దుబే 25, రింకు సింగ్ 37 పరుగులు చేశారు.అనంతరం లక్ష్య చేదనకు దిగిన నేపాల్( Nepal ) జట్టు ఆరంభం నుండి ఆచితూచి ఆడుతూ భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక వరుసగా వికెట్లను కోల్పోతూ 23 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓటమిని చవిచూసింది.

భారత జట్టు బౌలర్లు అవేష్ ఖాన్ 3, అర్ష దీప్ సింగ్ 2, రవి బిష్ణోయి 3 వికెట్లు తీయడంతో నేపాల్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు