జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాదమ్మ రాజు( Yadamma Raju ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఈ క్రమంలోనే బ్రహ్మాజీ ( Brahmaji ) కుమారుడు సంజయ్ రావు హీరోగా ఇండస్ట్రీకి స్లమ్ డాగ్ హస్బెండ్ ( Slum Dog Husband ) అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు.ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో యాదమ్మ రాజు నటించారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో కూడా యాదమ్మ రాజు పాల్గొన్నారు.అయితే ఈయనకు ప్రమాదం జరిగే హాస్పిటల్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఇలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు.అయితే ఈయనకు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్న విషయాల గురించి మాత్రం క్లారిటీ లేదు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి యాదమ్మ రాజు తనకు జరిగినటువంటి ప్రమాదం గురించి తెలియజేశారు.
అసలు తన తప్పు లేకపోయినా తనకు ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదం కారణంగా ఒక కాలి వేలు తొలగించారు అంటూ ఈ సందర్భంగా ఈయన తన ప్రమాదం గురించి తెలియజేశారు.
తాను ఇంటి నుంచి చాయ్ తాగడానికి బయటకు వెళ్లాను అయితే ఓ వ్యక్తి బైక్ ఫాస్ట్ గా వస్తు స్కిడ్ కావడంతో ఆ బైక్ తనకు తగిలిందని తెలిపారు.దీంతో కాలు మొత్తం గాయమైందని అలాగే ఒక వేలు మొత్తం తొలగించారు అంటూ తనకు జరిగిన ప్రమాదం గురించి తెలిపారు.అయితే ఈయన ఇలాంటి ప్రమాదానికి గురైన తిరిగి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రావడంతో ఈయనకు సినిమాల పట్ల నటన పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేశారు అంటూ ఈయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలి అంటూ కూడా ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy