పీఎఫ్ఐ హిట్ లిస్టులోని ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హిట్ లిస్టులో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలకు వై కేటగిరి భద్రత కల్పించారు.

దీనిలో భాగంగా కేరళకు చెందిన ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలకు కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది.

కేరళ పీఎఫ్ఐ సభ్యుడు మహమ్మద్ బషీర్ నివాసంలో ఎన్ఐఏ ఇటీవల నిర్వహించిన దాడుల్లో వారి హిట్ లిస్టుల్లో ఆర్ఎస్ఎస్ నాయకులున్నారని తెలిసింది.ఈ నేపథ్యంలో వారికి ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక మేరకు.

కేంద్ర హోంశాఖ వై కేటగిరి రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు 11 మంది కేంద్ర బలగాలకు చెందిన జవాన్లతో ఆర్ఎస్ఎస్ నేతలకు రక్షణ కల్పించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement