వామ్మో, కదులుతున్న రైలుపై డ్యాన్స్ చేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..

ఈ రోజుల్లో కొంతమంది యువతీయువకుల్లో కామన్ సెన్స్ అనేది బాగా లోపిస్తుంది.వీరు అనవసరంగా తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు.

కొందరైతే ఇలాంటి పిచ్చి పనుల వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు.ఇలాంటి వార్తలు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నా మూర్ఖపు పనులు చేసేవారి సంఖ్య తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే అలాంటి ఓ యువతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో సదరు యువతీ రన్నింగ్ లో ఉన్న రైలు పైకప్పు మీదకు ఎక్కి పరుగులు తీయడం గమనించవచ్చు.అంతేకాదు ఈ యువతి డ్యాన్స్( Young woman dancing ) చేస్తూ నడుస్తుంది.అంత ఎత్తులో కూడా ఆమె నిర్లక్ష్యంగా, నేల మీద ఉన్నట్లు డ్యాన్స్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

Advertisement

చివరికి ఆమె పడిపోతుందేమో అని అంతా అనుకున్నారు కానీ ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకొని దానిపై నిలబడగలిగింది.అయితే కాలక్రమేణా ట్రైన్ వేగంగా వెళ్లే అవకాశం ఉంది.అప్పుడు ఆమె దానిపై నిలబడటం కష్టంగా మారుతుంది.

చివరికి ఈ యువతి ట్రైన్ పై నుంచి సురక్షితంగా దిగిందా లేదా అనేది తెలియ రాలేదు.ఈ వీడియో బంగ్లాదేశ్‌లో( Bangladesh ) షూట్ చేసినట్లుగా భావిస్తున్నారు.

ఈ మహిళ ధైర్యం, ఉత్సాహం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆమె చేసిన ఈ దుస్సాహసం ప్రముఖ మొబైల్ గేమ్ అయిన సబ్వే సర్ఫర్స్‌( Subway Surfers )ను గుర్తు చేసింది.

చాలా మంది ఈ వీడియోను చూసి ఆనందించినప్పటికీ, కొంతమంది ఈమె భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ బ్రాండ్ కార్లపై టాలీవుడ్ మోజు.. నాగ్ కొత్త కారు ఖరీదు ఏకంగా అన్ని రూ.కోట్లా?
లైంగిక వేధింపుల కేసు .. కెనడాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్ , ఒంటరి మహిళలే టార్గెట్

ఎక్స్‌ (ట్విట్టర్)లో ఘర్ కే కైలాష్ అనే ఒక యూజర్ దీనిని షేర్ చేశాడు.దీన్ని చూసిన కొంతమంది ఈమె ధైర్యాన్ని అభినందించారు.ఒక వ్యక్తి, "ఇది అద్భుతం! సబ్వే సర్ఫర్స్ గేమ్ నిజ జీవితంలోకి వచ్చినట్లే!" అని కామెంట్ చేశారు.

Advertisement

అయితే, చాలా మంది నెటిజన్లు ఈ తరహా ప్రదర్శనలు చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.పరుగు తీసే రైలు పైకప్పుపై నడవడం చాలా ప్రమాదకరమైన పని అని వారు చెప్పారు.

కొందరు, ఈ టైప్ స్టంట్స్ ఇతరులను కూడా అనుకరించేలా ప్రేరేపిస్తాయి కాబట్టి ఇది తప్పుడు సందేశాన్ని ఇస్తుందని అన్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తాపత్రయంతో ప్రజలు ప్రాణాలను పణంగా పెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక వైపు ఈ వీడియోలు ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు ప్రమాదాల గురించి మనకు హెచ్చరికగా నిలుస్తున్నాయి.

తాజా వార్తలు