వావ్.. కేవలం రూ. 2 కే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్..!

ఈ కాలంలో చదువు అంటే డబ్బులతో కూడుకున్న పని.చదువును కొనుక్కుని మరి చదువుకుంటున్నాము.

ఉన్నత విద్యను అభ్యసించాలన్నా, ఏదైనా పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలన్నా గాని ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టాలిసిందే.అయితే ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.

టాలెంట్ ఉన్నాగాని కోచింగ్ ఇప్పించే స్తోమత లేక చాలా మంది పిల్లలు అట్టడుగున ఉండిపోతున్నారు.ఈ క్రమంలోనే బిహార్​ లోని ఒక కోచింగ్ సెంటర్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.

పోటీ పరీక్షలు దగ్గరపడుతున్న క్రమంలో కేవలం రెండు రూపాయిలకే రివిజన్ తరగతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఎవరయితే మే 8న జరిగే బీపీఎస్​సీ ప్రీలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.బీహార్ రాష్ట్రంలోని గల పట్నాలోని ఆఫీసర్స్ అకాడమీ కోచింగ్ ఇన్​స్టిట్యూట్ డైరెక్టర్ సౌరభ్ శర్మ​ రూ.2కే తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు.నమోదు చేసుకున్న విద్యార్థులు ఇన్​స్టిట్యూట్ వారు పెట్టే ఒక పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందట.

Advertisement

కాగ ఆసక్తి గల అభ్యర్థులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్​స్టిట్యూట్​ యాప్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు.లేదంటే ఇన్స్టిట్యూట్ వెబ్​సైట్​ లో గాని పేరు నమోదు చేసుకుని ఆన్​లైన్​లో తరగతులు వినవచ్చు.

ఇప్పటివరకు 4,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చిన మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement