వావ్, తలపై సూట్‌కేస్ పెట్టుకొని స్పీడుగా సైకిల్ తొక్కుతున్న యువకుడు..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ వీడియోలు చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు అవాక్కవుతున్నారు.

నౌ దిస్ అనే ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఓ యువకుడు ఒక అద్భుతమైన టాలెంట్ ను ప్రదర్శించాడు.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన తలపై నిటారుగా ఒక సూట్‌కేస్ పెట్టుకొని ఉండటం చూడవచ్చు.

అంతేకాదు అతడు ఒక రోడ్డుపై సైకిల్ తొక్కుతూ కనిపించాడు.సాధారణంగా సైకిల్ తొక్కుతూ వేరే పని చేయడం సాధ్యం కాదు.

Advertisement

అలా చేస్తే సైకిల్ పైనుంచి కింద పడే అవకాశం ఉంది.కానీ ఇతడు ఏకంగా తన తలపైన సూట్‌కేస్‌ను పెట్టుకొని దాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెల్లగలిగాడు.

ఈ ఒక భారీ సూట్‌కేస్‌ కింద పడి పోకుండా వేగంగా, మెలికలు తిప్పుకుంటూ ఇతడు బైస్కిల్‌ను రైడ్ చేశాడు.తల పైన సాధారణంగా చిన్నపాటి వస్తువులను బ్యాలెన్స్ చేయడమే కష్టం.

అలాంటిది ఇతడు ఒక పెద్ద సూట్‌కేస్‌నే బ్యాలెన్స్ చేస్తుండడంతో నెటిజనులు ఫిదా అవుతున్నారు.సూపర్ టాలెంట్ బ్రదర్ అని కితాబిస్తున్నారు.

ఈ స్టంట్‌ను న్యూయార్క్ సిటీలోని బ్రూక్లిన్ ఫిఫ్త్ అవెన్యూలో ఒక సైక్లిస్ట్ పూర్తి చేశాడని ఈ పోస్ట్ తెలిపింది.దీంతో భారతీయ రోడ్లపై ఇలా తొక్కడం అసాధ్యమని, ఎందుకంటే ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

"వాట్, యాన్ అమేజింగ్ స్కిల్" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఈ వీడియోకి ఇప్పటికే 45 వేలకు పైగా వ్యూస్, 100కి పైగా లైకులు వచ్చాయి.

Advertisement

ఈ వండర్ ఫుల్ వీడియో ని మీరు కూడా ఒకసారి వీక్షించండి.

తాజా వార్తలు