ఈ అల‌వాట్లు ఉంటే మీ దంతాలు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్టే జాగ్ర‌త్త‌!

దంతాలు ఆరోగ్యంగా ఉండ‌టం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉన్న‌ట్టు.

అయితే నేటి కాలంలో చాలా మంది దంత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు.ముఖ్యంగా పళ్లు పుచ్చు పట్టి పోవటం, చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం ఇలా ర‌క‌ర‌కాల దంత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.

అయితే ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి కేవ‌లం దంత సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం మాత్ర‌మే కాదు.కొన్ని కొన్ని అల‌వాట్ల కార‌ణంగా కూడా దంతాలు డేంజ‌ర్‌లో ప‌డుతుంటాయి.

మ‌రి ఆ అల‌వాట్లు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా చాలా మందికి త‌ర‌చూ గోళ్లు కొరికే అల‌వాటు ఉంటుంది.

Advertisement

ఈ అల‌వాటే దంతాల‌కు ముప్పుగా మారుతుంది.అదెలా అంటే.

గోళ్లను కొరికిన‌ప్పుడు అందులో ఉండే దుమ్ము, ధూళి, బాక్టీరియా పళ్ల‌కు ప‌ట్టేస్తుంది.దాంతో అనేక రకాల దంత సంబంధ‌ సమస్యలు త‌లెత్తుతాయి.

అలాగే కొంద‌రు ఏదైన ఆహారం తినేట‌ప్పుడు న‌మ‌లాల్సిన స‌మ‌యం కంటే ఎక్కువ‌గా న‌మ‌లుతుంటారు.దీని వ‌ల్ల దంతాలు ఒత్తిడికి లోనై.

పళ్ల మద్య సందులు, చిగుళ్ళ వాపు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.సోడాలు, కూల్ డ్రింక్స్ తాగే అల‌వాటు పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఉంటుంది.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
మొటిమ‌ల‌ను నివారించే కొబ్బరి పాలు.. ఎలాగో తెలుసా?

కానీ, ఈ సోడాలు మ‌రియు కూల్ డ్రింక్స్ దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.కొంద‌రు ఒక టూత్ బ్రెష్‌ను నెల‌లు తర‌బ‌డి వాడుతుంటారు.

Advertisement

కానీ, ఇలా చేస్తే బ్రష్ లోని బ్రేసిల్స్ గట్టిప‌డిపోయి.దంతాల‌ను, చిగుళ్ల‌ను డ్యామేజ్ చేస్తాయి.

కాబ‌ట్టి, టూత్ బ్రెష్‌ను త‌ర‌చూ మారుస్తూ ఉండాలి.అలాగే ఏదైనా ఆహారం తీసుకున్న వెంట‌నే.

నోటిని శుభ్రం చేసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి.ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్న వెంట‌నే నీటితో నోటిని క్లీన్ చేసుకోవాలి.

లేదంటే సిట్రస్ సమ్మేళనాలు బాక్టీరియా తో చర్య జరిపి దంతాల‌పై ఉండే ఎనామిల్‌ని నాశ‌నం చేస్తాయి.దాంతో ప‌ళ్లు సెన్సిటివ్‌గా మారిపోతాయి.

ఇక చాలా మందికి ఐస్‌ను తినే అల‌వాటు ఉంటుంది.మ‌రియు సీజ‌న్ ఐదేనా ఐస్ వాట‌ర్‌నే తాగుతుంటారు.

దీని వ‌ల్ల దంతాలలోని సున్నితమైన నరాలు దెబ్బతింటాయి.

తాజా వార్తలు