కదపగానే ఆకులో చలనం.. ఈ షాకింగ్ వీడియో మీరు చూశారా?

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వింత జీవులు ఉన్నాయి.మనకు తెలియని ఎన్నో జీవుల గురించి మనం సోషల్ మీడియా, మీడియాలో చూస్తుంటాం.

అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతుంటారు.ఇదే కోవలో ప్రస్తుతం ఓ కీటకానికి( Insect ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

దానిని చూడగానే మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయి.అది చూడడానికి నేలపై పడిన ఓ ఎండిపోయిన ఆకుగా( Leaf ) అంతా భావిస్తారు.

అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.ఎందుకంటే అది ఒక ప్రాణం ఉన్న జీవి.

Advertisement

దానిని పుల్లతో కదపగానే అది చకచకా ముందుకు వెళ్లిపోయింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

ఫిలియం గిగాంటియం అని కూడా పిలువబడే ఒక పెద్ద ఆకు పురుగును( Leaf Insects ) కలిగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో క్రేజీ వైరల్‌గా మారింది.ఈ కీటకాలు ఒక ఆకుతో అసాధారణమైన పోలికను కలిగి ఉంటాయి.ప్రపంచంలో అతిపెద్ద ఆకు పురుగు ఫిలియం గిగాంటియం.

చాలా వెడల్పుగా ఇది ఉంటుంది.ఆకు ఆకారంలో రూపాన్ని కలిగి ఉంటుంది.

అలాగే దానికి కాళ్లు ఉంటాయి.దీని మొత్తం రూపం చూస్తే ఒక ఎండిపోయిన ఆకులాగా కనిపిస్తుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

చర్మం అంచుల చుట్టూ గోధుమ రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది.రెండు గోధుమ రంగు చుక్కలు ఉదరం పైభాగంలో ఉంటాయి.దీనిని ఓ వ్యక్తి కేవలం ఆకులా భావించాడు.

Advertisement

దాని దగ్గరకు వెళ్లి కర్రతో( Stick ) దానిని కదిపి చూశాడు.మరో వైపునకు దానిని తిప్పగానే ఆ ఆకు రూపంలో ఉన్న కీటకం కదిలింది.

దీంతో ఆ వ్యక్తికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది.హౌ థింగ్స్ వర్క్ అనే ఎక్స్ (ట్విటర్) ఖాతాలో దీనిని షేర్ చేయగానే విపరీతంగా వైరల్ అవుతోంది.

నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు.తాము సైతం దానిని ఓ ఎండిపోయిన ఆకులా భావించామని కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు