సజ్జ జావతో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా.. అవేంటో తెలుసుకుంటే రోజు తాగేస్తారు!

తృణధాన్యాల్లోసజ్జలు ఒకటి.అయితే సరైన అవగాహన లేకపోవడం మరియు వీటి ప్రయోజనాల గురించి తెలియక పోవడం వల్ల చాలా మంది సజ్జలను పెద్దగా పట్టించుకోరు.

కానీ రాగులు మాదిరిగానే సజ్జల్లోనూ ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అసలు రోజుకు ఒక గ్లాస్ సజ్జ‌ జావను తీసుకుంటే మీరు ఊహించని ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం సజ్జ జావ ని ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? అన్నది తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

నెయ్యి కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాము, రెండు లవంగాలు( Cloves ) వేసి వేయించాలి.ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు సజ్జ పిండిని వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయాలి.

Advertisement

ఆపై రెండు గ్లాసులు వాటర్ ను కొంచెం కొంచెం గా పూసుకుంటూ పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత జావ చిక్కబడుతుంది.అప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే సజ్జ జావ సిద్ధం అయినట్టే.

ఇది రాగి జావ కంటే చాలా రుచిగా ఉంటుంది.సజ్జ జావను నిత్యం ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ సజ్జ జావ లో మెగ్నీషియం, పొటాషియం విరివిగా ఉంటాయి.ప్రతిరోజు ఈ జావను తాగితే శరీరంలో రక్త ప్రసరణ( Blood Circulation ) మెరుగుపడుతుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

బీపీ అదుపులో ఉంటుంది.

Advertisement

సజ్జ జావ మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది.రక్తహీనతకు అడ్డుకట్ట వేస్తుంది.కొలెస్ట్రాల్‌ ను నియంత్రించడంలో సజ్జ జావ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

దీంతో గుండె జబ్బులుచుట్టుముట్టకుండా ఉంటాయి.అంతేకాదు నిత్యం సజ్జ జావను తాగితే జీర్ణ వ్యవస్థ( Digestive system ) చురుగ్గా పనిచేస్తుంది.

గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

ఎముకలు దృఢంగా మారతాయి.అతి ఆకలి నుంచి విముక్తి ల‌భిస్తుంది.

మరియు రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా సైతం ఉంటారు.

తాజా వార్తలు