బిర్యానీ ఆకుతో టీ... తాగితే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

సాధార‌ణంగా ఉద‌యం లేవ‌గానే చాలా మందికి టీ తాగే అల‌వాటు ఉంటుంది.టీ తాగ‌క‌పోతే రోజు కూడా గ‌డ‌వ‌దు అన్నంతగా దానిని అల‌వాటు చేసుకుంటారు.

ఒక కొంద‌రైతే ఉద‌య‌మే కాదు.మధ్యాహ్నం, సాయత్రం ఇలా ఎప్పుడు ప‌డితే అప్పుడు టీ తాగుతుంటారు.

వాస్త‌వానికి పాలు క‌లిపిన టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.కానీ, దాని బ‌దులుగా బిర్యానీ ఆకుల‌తో త‌యారు చేసిన టీ తాగితే.

బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.బిర్యానీ ఆకును కేవ‌డం బిర్యానీలోనే కాదు.

Advertisement

మ‌సాలా వంట‌ల్లో కూడా వినియోగిస్తుంది.

అయితే ఎన్నో పోష‌కాలు నిండి ఉన్న బిర్యానీ ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

ప్ర‌తి రోజు ఉద‌యాన్నే బిర్యానీ ఆకుల‌ టీ సేవించ‌డం వ‌ల్ల జలుబు, ఫ్లూ, ద‌గ్గు, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.ఈ స‌మ‌స్య‌లు ఉన్న వారు బిర్యానీ ఆకుల టీ తాగితే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే నేటి కాలంలో చాలా మంది గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అలాంటి వారు రోజుకో క‌ప్పు బిర్యానీ ఆకుల టీ తాగితే.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
ఆలు తొక్కతో ఇలా చేస్తే‌ అందంగా మెరిసిపోవ‌చ్చు!!

ఆ స‌మ‌స్య‌లు దూరం అవ్వ‌డంతో పాడు జీర్ణ క్రియ వేగ‌వంతంగా ప‌ని చేస్తుంది.ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డేవారికి కూడా బిర్యానీ ఆకుల టీ గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

ఎందుకంటే, బిర్యానీ ఆకుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది.ఇది ర‌క్త హీత‌న స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ లు విటమిన్ సి బిర్యానీ ఆకులో స‌మృద్ధిగా ఉంటాయి.కాబ‌ట్టి, బిర్యానీ ఆకుల‌తో త‌యారు చేసిన టీని రోజుకో క‌ప్పు చ‌ప్పున తీసుకుంటే.ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెర‌గ‌డంతో పాటు అనేక రోగాల‌కు దూరంగా ఉండొచ్చు.

ఇక నేటి కాలంలో బ‌రువు త‌గ్గాల‌ని చాలా మంది ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అలాంటి వారు బిర్యానీ ఆకుల టీ సేవిస్తే.

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

తాజా వార్తలు