మంచినీటి కోసం ఓ మహిళ పడుతున్నా కష్టాలు...

మహిళలు మంచినీటి కోసం బావి గోడపై నుంచి ఎలా పైకి తీసుకునే వీడియోలో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.

ఘుసియా గ్రామంలో బావులు, చెరువులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర చర్యలు తీసుకోవలసి వచ్చింది.

భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలు ఇలాంటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.నీటి కోసం భారతీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టే వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.

మహారాష్ట్రలో నీటి కోసం ఒక మహిళ బావిలో దిగి మంచి నీటిని తోడి బావినుంచి పైకి తీసుకురావడంతో వీడియో వైరల్ గా మారింది.మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా రాష్ట్రాలు సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది.

మధ్యప్రదేశ్‌లో ప్రతి వేసవిలో నీటి కొరత పునరావృతమయ్యే సమస్య ఎప్పుడు ఉంటునే ఉంది.రాష్ట్ర ప్రభుత్వం 2024 నాటికి ప్రతి గ్రామానికి కుళాయి నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చించారు.

Advertisement

కానీ ఇప్పటికీ లక్షలాది మందికి తాగునీరు అందడం లేదు.ఘుసియాలో గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

అంతే కాక ఈ సంవత్సరం స్థానిక ఎన్నికలను ప్రభుత్వాన్ని బహిష్కరిస్తామని చెప్పారు.అయితే మహిళలు నీటిని సేకరించడానికి బావిలో దిగాలి.

అక్కడ మూడు బావులు ఉన్నాయి.అన్నీ దాదాపు ఎండిపోయి ఉన్నాయి.చేతి పంపులతో నీరు రావడంలేదని ఓ మీడియా సంస్థకు తెలిపింది.

అయితే ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడి వస్తారని వారు అంటున్నారు.ఈసారి సరైన నీటి సరఫరా చేసే వరకు రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయ్యకూడదని వాళ్లు నిర్ణయించుకున్నారు.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....

మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా రాష్ట్రాలు సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతింటున్నాయి.అయితే మంచి నీటి కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తామని అక్కడ ఉండే ప్రజలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు