వైరల్ వీడియో: ఆడవాళ్లు అలర్ట్.. ఇలా సడన్‌గా టైరులో చున్నీ ఇరుక్కపోతే ప్రాణానికే ప్రమాదం..

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పనికి కూడా చాలా మంది బైక్స్, స్కూటీస్ పై ఆధారపడి బయటికి వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే ఇలాంటి సమయాలలో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

మనం ఎంత జాగ్రత్తగా బైక్స్ లేదా స్కూటీస్ డ్రైవ్ చేసినా కానీ.ఒక్కోసారి ప్రమాదానికి గురవుతుంటాం.

ముక్యంగా మహిళలు( Women ) స్కూటీస్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.కొన్ని కొన్ని సందర్భాలలో మహిళ చీర కొంగు( Scarf ) టైర్లు ఇరుకొని ఇబ్బందిపడిన సంఘటనలు, అలాగే ఆడవారి వేసుకునే చున్నీలు టైర్ల మధ్యలో ఇరుక్కొని ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

అచ్చం అలాంటి సంఘటననే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక యువతి తన స్నేహితురాలని బైక్ పై( Bike ) ఎక్కించుకొని వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి తన మెడలో ఉన్న చున్నీ ఒకవైపు కిందకు వెళ్లి చివరకు టైర్లో ఇరుక్కుపోయింది.దీంతో అనుకోకుండా ఆమె పూర్తిగా ముందుకు వంగిపోవడం.

Advertisement

, చున్నీ టైట్ అయ్యే కొద్ది ఆమె తల హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయింది.అయితే.

, ఆ యువతి చాలా తెలివిగా బైకును కంట్రోల్ చేస్తూ మెల్ల మెల్లగా బ్రేకులు వేసి కింద పడకుండా బైకును కంట్రోల్ చేసింది.

దీంతో వెంటనే వెనుక కూర్చున్న అమ్మాయి కిందికి దిగి ఆ యువతికి ఏమైందా అని చూడగా., అక్కడ ఉన్నవారు అందరూ కూడా వారి ఇద్దరికీ సహాయం చేశారు.అలాగే చివరికి ఆమె మెడలో ఉన్న చున్నీనీ పక్కకు తీసి, అలాగే టైర్లో ఇరుక్కున్న చున్నిని కూడా తీసేయడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు.

అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం తలెత్తకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ మాత్రం వామ్మో.అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేదో అంటూ కామెంట్ చేయగా.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

, ఇక మరికొందరైతే ఇలాంటి సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు