మహిళను రైలు కింది తోసేసి దారుణం.. ఆపై పిల్లలతో పరారీ!

ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.

ఆ వ్యక్తి చేసిన హృదయ విదారక ఘటనకు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తి చనిపోయిన మహిళ భర్త అయి ఉంటాడనని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగింది అంటే.

Woman Was Dragged Out Of Sleep And Pushed In Front Of A Moving Train , Maharasht

అది ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్.అక్కడ ప్లాట్ ఫాంపై ఓ మహిళ తన పిల్లలతో కలిసి నిద్రిస్తోంది.

ఉన్నట్టుండి వచ్చిన వ్యక్తి ఆ మహిళను నిద్రలోంచి లేపి రైలు ముందు ట్రాక్ పైకి తోసేశాడు.అనంతరం పిల్లలను ఎత్తుకుని అక్కడి నుండి పారి పోయాడు.

Advertisement

ఈ ఘోరమైన ఘటనలో ఆ మహిల చనిపోయింది.ఈ ఘోరమంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

ఆదివారం పగటి సమయం నుండి ఓ వ్యక్తి, మహిళ ఇద్దరు పిల్లలు వసాయ్ రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు.ఆదివారం మధ్యాహ్నం వచ్చిన వారు ఆ రాత్రంతా అక్కడే ఉన్నారు.

స్టేషన్ లోని బల్లపైనే నిద్ర పోయారు.సోమవారం తెల్లవారు జామున నాలుగింటి సమయంలో ఆ వ్యక్తి.

ఆ మహిళను నిద్ర లేపాడు.ఆమెతో కాసేపు ఏదో మాట్లాడాడు.

Aloe vera : వాస్తు ప్రకారం కలబంద ఈ దిశలో నాటారంటే.. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..!

అనంతరం రైలు కిందకు తోసేశాడు. రైలు కింద పడిపోయిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Advertisement

అక్కడే బల్లపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను లేపి, వారిని లాక్కొని అక్కడి నుండి పారి పోయాడు.అయితే హత్యకు పాల్పడ్డ ఆ వ్యక్తి మృతురాలి భర్త అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

తాజా వార్తలు