రూ.2.5 కోట్లతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న యువతికి వింత సవాల్..

డెనిస్ రోచా( Denise Rocha ) అనే 39 ఏళ్ల బ్రెజిలియన్ మహిళ అందంగా తయారు కావడానికి ఇటీవల కొన్ని ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీలు( Facial Plastic Surgeries ) చేయించుకుంది.

అయితే, దీనివల్ల ఆమెకు ఒక వింత సమస్య ఎదురయింది.

ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను( Driving License ) రెన్యువల్ చేయలేక ఇబ్బంది పడింది.పెదవులు, దవడ, ముక్కు, చెంప ఎముకలతో సహా పూర్తిగా మారిపోయిన ఆమె ముఖ లక్షణాల కారణంగా ఓల్డ్ ఫొటోలోని మహిళ, ఈమె సేమ్ కాదేమో అని అధికారులు మొదట్లో సందేహించారు.

ఆమె తన ఐడెంటిటీ అదే అని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు నమ్మలేదు.ఫోటోలో ఉన్నది ఆమే అని నిర్ధారించడానికి అడిషనల్ ఐడెంటిఫికేషన్( Additional Identification ) కావాలని అభ్యర్థించారు.

దాంతో చేసేది ఏమీ లేక డెనిస్ తన బ్రెజిలియన్ బార్ అసోసియేషన్ కార్డ్‌ను సమర్పించింది, అది ఆమె ఐడెంటిటీని విజయవంతంగా నిర్ధారించింది.దాంతో ఈ మహిళా ఊపిరి పీల్చుకుంది.

Advertisement

తరువాత ఇదొక తమాషా పరిస్థితి అని తెలిపింది, ఓన్ ఐడెంటిటీ నిరూపించుకోవడానికి తాను పడిన అవస్థలను కూడా ఆమె ప్రస్తావించింది.

డెనిస్ ఒక మాజీ లాయర్.ప్రస్తుతం ఓన్లీ ఫ్యాన్స్ మోడల్.లైపోసక్షన్, స్కిన్ పీలింగ్, మూడు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్లు, బొటాక్స్ ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలతో సహా ఆమె కాస్మెటిక్ సర్జరీలు( Cosmetic Surgeries ) చేయించుకుంది.

వాటి గురించి ఆమె బోల్డ్‌గా, ఓపెన్‌గా చెబుతుంది.సావోపాలోలో నివసించే ఈమె ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేసింది.ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించడానికి ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటుంది.

ఓన్లీ ఫ్యాన్స్( Only Fans ) ప్లాట్‌ఫామ్‌లో చాలా మంది నుంచి మద్దతును పొందినప్పటికీ, డెనిస్ తన లుక్ కారణంగా కొందరు మగవారు ఆమె తెలివి తక్కువగా భావిస్తారని ఆమె చెప్పింది.తనను తాను సేపియోసెక్సువల్‌గా అభివర్ణించింది.మొత్తంమీద, డెనిస్ ప్లాస్టిక్ సర్జరీ వల్ల కొన్ని సవాళ్లు ఎదుర్కొంటుంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు