భర్త చిత్రహింసలకు విసిగిపోయిన భార్య.. చివరికి ఏం చేసిందంటే..?

సంసారం అన్నాక భార్యాభర్తలు బాధ్యతగా వ్యవహరించి కుటుంబంలో సంతోషానికి లోటు లేకుండా చూసుకోవాలి.

అలా బాధ్యతగా ఉండాల్సిన భర్త, తన భార్యకు వివాహేతర సంబంధం( Illegal Relationship ) ఉందని అనుమానిస్తూ.

రోజు పీకలదాకా మద్యం సేవించి చిత్రహింసలు పెట్టేవాడు.కొంతకాలం భర్త( Husband ) మార్పు కోసం భార్య ఎదురుచూసిన ఎటువంటి ఫలితం లేదు.

ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి రావడం, పిల్లల ముందు అసభ్యంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉండడంతో విసిగిపోయిన భార్య ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత తనకేం తెలియనట్టు నటించింది.

కానీ పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే.?

Advertisement

వివరాల్లోకెళితే ఆంధ్రప్రదేశ్ లోని( Andhra Pradesh ) బాపట్ల లోని వేటపాలెంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది.దేశాయిపేట పంచాయతీ అంబేద్కర్ నగర్లో సలగల అజయ్ బాబు, శోభారాణి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు.అయితే శోభారాణి కి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అజయ్ బాబు( Ajay Babu ) ప్రతిరోజు చిత్రహింసలు పెట్టేవాడు.

ఈ విషయంపై మాట్లాడేందుకు శోభ రాణి( Shoba Rani ) తన తల్లి చేపూరి నాగమ్మని ఈనెల 13న తన ఇంటికి పిలిపించుకుంది.ఆరోజు కూడా మద్యం తాగి వచ్చి అజయ్ బాబు ఇంట్లో రచ్చ చేశాడు.

తర్వాత నిద్రలో అజయ్ బాబు చంపేస్తానంటూ కలవరించడంతో శోభారాణి భయంతో ఓ ఇనుప రాడ్డు తీసుకొని గాఢ నిద్రలో ఉన్న అజయ్ ముఖంపై, నుదుటిపై ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది.

కొన ఊపిరితో ఉన్న అజయ్ ను శోభ రాణి తన తల్లి సహాయంతో చుడీదార్ ప్యాంట్ కు ఉండే నాడతో గొంతు బిగించి చంపేసింది.తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి అజయ్ మృతదేహాన్ని బట్టలు ఉతికే బండపై పడేసి, మద్యం సేవించి వచ్చి బండపై పడి చనిపోయాడని అందరినీ నమ్మించారు.కానీ మృతుడి సోదరుడికి కాస్త అనుమానంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

పోలీసులు తమ స్టైల్ లో విచారణ చేయడంతో శోభారాణి నిజాన్ని బయటపెట్టేసింది.పోలీసులు హత్య కోసం ఉపయోగించిన ఇనుపరాడును, రక్తంతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు.

Advertisement

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

తాజా వార్తలు