అతి చేస్తే రిజల్ట్ ఇలాగె ఉంటది! రీల్స్ వైరటీగా చేద్దామని అనుకుంటే, చివరకు?

ప్రస్తుత కాలంలో యువతరంలో వైరల్( Viral ) కావాలన్న యావ అమితంగా పెరిగింది.గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ షార్ట్ వీడియోలు ఆదాయ వనరుగా మారాయి.

అయితే, కంటెంట్ క్రియేటర్ల సంఖ్య పెరగడంతో పోటీ కూడా తీవ్రమైంది.నెటిజన్లను ఆకర్షించేందుకు, ఫాలోవర్లను పెంచుకోవడానికి కొత్తగా ఏదైనా చేయాలన్న ప్రయత్నంలో కొందరు అనుకోని సమస్యల్లో చిక్కుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితే తాజాగా ఓ మహిళకు ఎదురైంది.తన షార్ట్ వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఆమె చేసిన పని చివరికి హాస్యాస్పదమైన దృశ్యాలకు దారి తీసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Woman Fell Down While Dancing On House Roof Video Viral Details, Viral Video, So
Advertisement
Woman Fell Down While Dancing On House Roof Video Viral Details, Viral Video, So

వైరల్ వీడియోలో కనిపించిన విధంగా, ఓ మహిళ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఇంటి మీద ఎక్కి డ్యాన్స్( Dance ) చేయడం ప్రారంభించింది.అయితే, ఆమె ఇంటి పైకప్పు( House Roof ) రేకుల‌తో తయారై ఉంది.ఎవరైనా పైకప్పు మీద నడిస్తే లేదా కదలికలు చేస్తే అవి పగిలిపోవడం సహజమే.

కానీ, వైరల్ కావాలనే తపనలో ఆమె ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది.చీరకట్టులోనే పైకప్పుపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.

రెండు క్షణాలు డ్యాన్స్ చేసిన తర్వాత, వ్యూస్‌ కోసం ఇంకాస్త ఎక్కువ రిస్క్ తీసుకోవాలని భావించి ఒక్కసారిగా కిందకు దూకింది.అయితే దూకే క్రమంలో చీర రేకుకు తగలడంతో బ్యాలెన్స్ కోల్పోయి నేలకి బొక్కబోర్లా పడిపోయింది.

ఈ ఫన్నీ ఘటనను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

Woman Fell Down While Dancing On House Roof Video Viral Details, Viral Video, So
సికిందర్ మూవీ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇంత దారుణమా?
మొదటిసారి బూందీ లడ్డును రుచి చూసిన విదేశీ అమ్మాయి.. ఆమె ఇచ్చిన ఫిలింగ్స్ మాములుగా లేవుగా!

కొందరు ఆ మహిళా పరిస్థితిపై జాలిపడుతూ, వైరల్‌ కావాలన్న తపనలో ఇలాంటి అనుకోని ప్రమాదాలు ఎదుర్కొంటున్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు.ఈ ఘటన ద్వారా కంటెంట్ క్రియేటర్లు ఒక విషయం గమనించాలి.వైరల్‌ కావాలనే ఉద్దేశంతో, రిస్క్ తీసుకోవడం కంటే, క్రియేటివ్‌గా, ఒరిజినల్‌గా ఉండటమే ఉత్తమ మార్గం.

Advertisement

ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రమాదకరంగా వ్యవహరిస్తే, శారీరకంగా గాయాలే కాకుండా, అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజా వార్తలు