ఇటీవలే కాలంలో ప్రేమ వ్యవహారాలు పెళ్లి ప్రస్తావన వచ్చాక ముగుస్తున్నాయి.వందలో 10 శాతం మంది ప్రేమికులే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
మిగిలిన 90 శాతం మంది ప్రేమికులు పెళ్లి ప్రస్తావన వచ్చాక తమ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ మహిళకు వివాహం తర్వాత భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది.అయితే అదే గ్రామానికి చెందిన పెళ్లయిన యువకుడితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి( Illegal Relationship ) దారితీసింది.
పెళ్లి ప్రస్తావన వచ్చాక ప్రియుడు( Boyfriend ) అంగీకారం తెలుపకపోవడంతో ఏకంగా ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ఘటన ఝార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లా తారాతండ్ గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.తారాతండ్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది.అదే గ్రామానికి చెందిన సునీల్( Suneel ) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
సునీల్ కి ఇంతకుముందే వివాహం అయింది.వీరి వివాహేతర సంబంధం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది.
ఆ యువతి పెళ్లి చేసుకోవాలని సునీల్ పై ఒత్తిడి తెచ్చింది.సునీల్ మాత్రం పెళ్లికి అంగీకరించలేదు.
దీంతో సునీల్ పై కోపం పెంచుకున్న ఆ యువతీ ఒంటరిగా కలవాలని సునీల్ ను పిలిచింది.ప్రియురాలు పిలిచింది కదా అని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సరసాలు మొదలుపెట్టాడు.అయితే అప్పటికే ఆ యువతి సునీల్ కోసం ఎదురుచూస్తూ అతనిపై పగ తీర్చుకునేందుకు చేతిలో ఒక బ్లేడ్ ( Blade ) తీసుకుని మంచి సమయం కోసం ఎదురుచూసి సునీల్ మర్మాంగం కోసేసింది.
తీవ్ర రక్తస్రావం అయ్యి సునీల్ అక్కడికక్కడే నేలకూలి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.సునీల్ చనిపోయాడని భావించిన యువతి నేరుగా తారాతండ్ పోలీస్ స్టేషన్ కు( Taratand Police Station ) వెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించి లొంగిపోయింది.
ఈ వార్త బయటకు రావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy