వామ్మో ఈ తోడేలు చేప నోరు తెరిచిందంటే గజగజ వణకాల్సిందే..!

మహా సముద్రాల్లో రకరకాల చేపలు మనకు దర్శనం ఇస్తుంటాయి.వాటిలో కొన్ని షార్క్ చేపల లాగా ప్రమాదకరమైనవి కాగా.

మరికొన్ని మరికొన్ని సాధారణమైనవి ఉంటాయి.అయితే అమెరికాలోని ఓ జాలరి వలకు చిక్కిన చేపను చూస్తే.

చేపా తోడేలా అనేంత భయంకరంగా ఉంది.అది నోరు తెరిచినప్పుడు చూస్తే మాత్రం తీవ్రంగా భయపడాల్సిందే.

పెద్ద నోరు తెరిచే తనను పట్టుకున్న వాళ్లను కరిచేందుకు చాలానే ప్రయత్నించింది.అతనికి దాని సంగతి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు.

Advertisement

మోనే యాంగ్లర్ జాకోబ్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో ఈ చేపకి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు.భారీ తోడేలు చేప అని దాన్ని నెటిజెన్లకు పరిచయం చేశాడు.

పడవలో నీరు లేని చోటు కూడా ఆ చేప గింజుకుంటూ ఉంది.నోటికి ఏది దొరికితే దాన్ని కొరికేద్దామని చూస్తోంది.

అయితే ఇలాంటి చేపలు చాలా ప్రమాదకరమైనవని.వాటి నోటికి చిక్కామంటే ఇక మన పని అంతే అని జాలరి చెప్పాడు.

అలాగే ఇవి ఎక్కువగా వలల్లో చిక్కవని.తమను తాము రక్షించుకోవడంలో ఈ చేపలు ఎప్పుడూ ముందుంటాయని వివరించాడు.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

ఈ చేపలు ఇతర చేపల్ని ఆహారంగా తినేస్తాయంట.అయితే ఓ చనిపోయిన రొయ్యను ఆ చేప నోట్లో పెట్టి మళ్లీ దాన్ని సముద్రంలోనే వదిలి పెట్టాడు.

Advertisement

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో క్లిప్ ని టిక్ టాక్ లో పోస్ట్ చేయగా.32 లక్షల వ్ూస్, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

తాజా వార్తలు