ట్రాకర్ రోబోలతో ఉగ్రవాదుల భరతం పట్టారు.. సొరంగంలో ఆర్మీ క్లిష్టమైన ఆపరేషన్

హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్ దళాలు( Israel ) గాజాలో ( Gaza ) క్లిష్టమైన ఆపరేషన్ చేపడుతున్నాయి.

ఇళ్ల మధ్యలో, హాస్పిటల్ కింద భాగాల్లో నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ సొరంగాలు నిర్మించింది.

వీటి లోపలికి వెళ్లి హమాస్ ఉగ్రవాదులను బంధించడం అంటే సామాన్యమైన విషయం కాదు.ఇక్కడే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్( Israel Defence Force ) తమ ప్రతిభను చాటారు.

సొరంగాల్లోకి ట్రాకర్ రోబోలను( Tracker Robots ) పంపారు.దీని తర్వాత, ఇజ్రాయెల్ ఆర్మీ ఇంజనీర్లు సొరంగంలో బ్లాస్ట్ జెల్‌తో నింపి డిటోనేటర్‌తో పేల్చారు.

దీంతో పాటు పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఐడీఎఫ్ చుట్టుముట్టింది.గాజాలోని బీట్ హనౌన్ జిల్లా సమీపంలోని రహదారిపై కనీసం మూడు ప్రదేశాల నుండి పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి.

Advertisement

ఆ తర్వాత ఎక్కడి నుంచి పొగలు రావడంతో ఆ ప్రదేశాలన్నింటినీ పరిశీలించారు.

వందల కిలోమీటర్ల మేర భూగర్భంలో విస్తరించి ఉన్న గాజాలోని హమాస్ బంకర్లు, యాక్సెస్ షాఫ్ట్‌లు, సొరంగాలను గుర్తించడానికి ఆయుధాలు ఉపయోగించలేరు.ఇజ్రాయెల్ ఆర్మీ దీని కోసం ట్రాకర్ రోబోట్‌లను, ఇతర రిమోట్‌తో పనిచేసే సాంకేతికతను ఉపయోగిస్తోంది.హమాస్ సొరంగాలను( Hamas Tunnels ) కనుగొనడానికి ఇతర పద్ధతులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు చెప్పారు.

బలగాలు పనిచేస్తున్న బీట్ హనౌన్‌లో కొందరు ముష్కరులు సొరంగం షాఫ్ట్‌ల నుంచి ఇజ్రాయెల్ దళాలపై దాడి చేశారని వారు చెప్పారు.ఈ దాడిలో కొందరు సైనికులు కూడా మరణించారు.

ఇరుకైన, చీకటి, గాలి సరిగా లేని, కూలిపోతున్న మార్గం గురించి పూర్తి అవగాహన ఉన్న హమాస్ టెర్రరిస్టులను ఎదుర్కోవడానికి సొరంగం యొక్క ఇతర దిశలో దళాలను పంపకూడదన్నది ఇజ్రాయెల్ విధానం అని వారు అన్నారు.అటువంటి పరిస్థితిలో, ఆ సొరంగాలను బ్లాస్ట్ జెల్‌తో( Blast Gel ) నింపుతున్నారు.అవి పేలుడు తర్వాత మూసివేయబడతాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

ఇలా అల్ షిఫా ఆసుపత్రి( Al Shifa Hospital ) కింద ఉన్న సొరంగాన్ని ఐడీఎఫ్ దళాలు కనుగొన్నాయి.వారం వ్యవధిలో 130 సొరంగ ప్రవేశ మార్గాలను ఐడీఎఫ్ సైన్యం నాశనం చేసింది.

Advertisement

భూ ఉపరితలం నుంచి 65 నుంచి 260 అడుగుల కింద సొరంగాలను హమాస్ తీవ్రవాదులు నిర్మించారు.ఆ సొరంగాలలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ప్రజలను బందీలుగా ఉంచడంతో ఐడీఎఫ్ ఆచితూచి అడుగేస్తోంది.

తాజా వార్తలు