ఈ వీసాతో 26 దేశాలు చుట్టి రావొచ్చు.. సులువుగా జారీ చేసే దేశాలివే

ఇతర దేశాలకు వెళ్లాలంటే మనకు వీసా( Visa ) కావాలి.అయితే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ దేశాలను చుట్టి రావాలని పర్యాటకులు అనుకుంటారు.

ముఖ్యంగా టూరిస్ట్ డెస్టినేషన్ అయిన యూరప్ దేశాలలో పర్యటించాలని భావిస్తారు.ఇలాంటి సమయంలో ఓ విషయం తెలుసుకోవాలి.

దీని కోసం స్కెంజెన్ వీసా( Schengen Visa ) సాయపడుతుంది.దీనితో ఏకంగా 26 దేశాలలో( 26 Countries ) పర్యటించవచ్చు.

స్కెంజెన్ ఏరియా అనేది 26 యూరోపియన్ దేశాలు తమ అంతర్గత సరిహద్దులను, ప్రజల స్వేచ్ఛా అనియంత్రిత రాకపోకలకు అనుగుణంగా ఒక జోన్‌గా మార్చుకున్నారు.స్కెంజెన్ అనేది ఐర్లాండ్ మినహా చాలా EU దేశాలను కవర్ చేస్తుంది.

Advertisement

త్వరలో స్కెంజెన్ ప్రాంతంలో రొమేనియా, బల్గేరియా, సైప్రస్ దేశాలు భాగం కానున్నాయి.EU సభ్యులు కానప్పటికీ, నార్వే, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, లిక్టెన్‌స్టెయిన్ వంటి దేశాలు కూడా స్కెంజెన్ జోన్‌లో భాగంగా ఉన్నాయి.ఈ స్కెంజెన్ వీసాను కొన్ని దేశాలు సులువుగా అందిస్తున్నాయి.

తద్వారా ఆయా దేశాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఊతమిస్తున్నాయి.ఈ జాబితాలో స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ ఉన్నాయి.

మన దేశంలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో ఇవి మనకు సులువుగా లభ్యం అవుతాయి.పేపర్ వర్క్ పూర్తి చేయగానే మన ట్రావెల్ హిస్టరీ, మీ ఉద్దేశం, మీ ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తారు.అన్నీ సక్రమంగా ఉంటే చాలా త్వరగా స్కెంజెన్ వీసాను జారీ చేస్తాయి.

మీరు అందించే అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా అసలైనవి అయి ఉండాలి.ఫోటోకాపీలు లేదా జిరాక్స్‌లు ఆమోదించబడవు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

మీ పాస్‌పోర్ట్ కాపీలు, మీరు ఎంబసీకి సమర్పించే అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకుని ఆయా రాయబార కార్యాలయాలను సంప్రదిస్తే త్వరితగతిన మీకు వీసాలు మంజూరు అవుతాయి.

Advertisement

తాజా వార్తలు