తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించండి..: చిదంబరం

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.గ్యాస్ సిలిండర్ ధరలపై మాట్లాడిన ఆయన తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని చిదంబరం తెలిపారు.తెలంగాణలో నిరుద్యోగం దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న ఆయన ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా కేసీఆర్ సర్కార్ భర్తీ చేయలేదని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వచ్చాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ పౌరుడిపై సగటు అప్పు రూ.లక్షకు చేరుకుందని తెలిపారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడారో తనకు అంతా గుర్తుందని చెప్పారు.

శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సులన్నీ పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణ ఇచ్చామని పేర్కొన్నారు.కేసీఆర్ చావు నోట్లో తలపెట్టినందుకు కాదు.ప్రజల ఆకాంక్షల కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet
Advertisement