అన్ని స్థానాల్లోనూ గెలుపు .. 'మెగా ' బ్రదర్ కాన్ఫిడెన్స్

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి,  జనసేన, బిజెపిలు  కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి.

ఈ ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు బ్రహ్మరధం పట్టారని , తప్పకుండా తామే గెలుస్తామనే ధీమాతో కూటమి పార్టీల నేతలు ధామాగా ఉన్నారు.

ఏపీలో వైసిపి పాలనపై జనం విసుగు చెందారని, అందుకే తమ కూటమిని గెలిపిస్తున్నారు అని ధీమా గా చెబుతున్నారు.ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల విషయంలో తాజాగా జనసేన పార్టీ కీలక నేత ,పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు( Nagababu ) స్పందించారు.

పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించిన నాగబాబు ఎన్నికల పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలలో తాము పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలోను జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారని నాగబాబు చెప్పారు.

అన్ని సర్వేలు, మీడియా సంస్థ నివేదికలు కూటమి అధికారంలోకి వస్తుందనే విషయాన్ని చెబుతున్నాయని, జనసేన( Janasena ) పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లోనూ గెలవబోతున్నట్లు నాగబాబు వెల్లడించారు.ఎన్నికల సందర్భంగా ఎదురైన సవాళ్లు, నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ జరిగిన తీరు వంటి అంశాలపై అభ్యర్థులతో వర్చువల్ గా మాట్లాడారు.మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ త్యాగం , చంద్రబాబు అనుభవం, బీజేపీ కృషి ఫలించాయని, కూటమికి పట్టం కట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని, జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని నాగబాబు వెల్లడించారు.

Advertisement

జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెడుతున్నారని నాగబాబు వ్యాఖ్యానించారు.తమ అందరికీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వెన్నుముక అని, 17 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 సంవత్సరాలుగా పార్టీ ముందుకు నడిపిస్తున్న తీరు, ఆయన కష్టం, శారీరకంగా, మానసికంగా ఎంత ఒత్తిడి తీసుకుని ముందుకు వెళ్లారో ప్రత్యక్షంగా చూసామని నాగబాబు వెల్లడించారు.పవన్ కళ్యాణ్ కష్టం వృధా కాకూడదనే ఉద్దేశంతోనే జనసైనికులు అంతా కలిసి పని చేశారని నాగబాబు అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు