జగన్ కు ఆ హామీలే తలపోటుగా మారుతాయా ?

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పక్కా ప్రణాలికతో ఉన్నారు.

ఈసారి ఏకంగా 175 స్థానాల్లో విజయం సాధించాలనేది ఆయన టార్గెట్.

ఇప్పటికే పదే పదే ఆ విషయాన్ని పార్టీ నేతలకు గట్టిగా నొప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి.ప్రస్తుతం పార్టీకి ప్రజల్లో మంచి ఆధారణ ఉందని, తాము అందిస్తున్న పరదర్శకమైన పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని జగన్ తరచూ చెబుతూ వస్తున్నారు.

సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని ఈ నిబద్దతే తమకు మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టడంతో పాటు 175 స్థానాల్లో విజయానికి బాటలు వేస్తుందని ఆయన నమ్ముతున్నారు.

Will Those Assurances Become A Headache For Jagan , Ys Jagan Mohan Reddy, Ap

అయితే జగన్ గత ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని హామీలు విజయనికి పంటి కింద రాయిలా మారతాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని, సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్( Job calendar ) విడుదల చేస్తామని ఇలా జగన్ నొక్కి చెప్పిన హామీలు చాలా ఉన్నాయి.అయితే వీటన్నిటికి పక్కన పెట్టి ప్రజలకు డబ్బును పంచే బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని మాత్రమే జగన్ ఫాలో అవుతున్నారనే విమర్శ మెజారిటీ ప్రజల్లో ఉంది.

Advertisement
Will Those Assurances Become A Headache For Jagan , YS Jagan Mohan Reddy, Ap

సిపిఎస్ స్థానంలో జీపీఎస్ ను తీసుకొచ్చారు.

Will Those Assurances Become A Headache For Jagan , Ys Jagan Mohan Reddy, Ap

అలాగే సంపూర్ణ మద్యపాన నిషేదం అని చెప్పిన ఆయన మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు.ఇక జాబ్ కాలెండర్ సంగతి సరేసరి.ఏపీపిఎస్స్సీ , డి‌ఎస్‌సి.

నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో అని నిరుద్యోగులు కళ్ళు కాయలు కచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక పోలవరం ప్రాజెక్ట్( Polavaram Project ) పూర్తి చేయడాన్ని అసలు పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా వైసీపీకి విజయాన్ని దూరం చేసే అంశాలుగా మారతాయని కొందరి అభిప్రాయం.

మరి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని చెబుతున్నా వైఎస్ జగన్ కు ఈ హామీలు ఎంతవరకు ప్రతికూలత చూపిస్తాయో చూడాలి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు