సార్వత్రిక ఎన్నికల్లో కామ్రెడ్స్ తో కలిసి వెళ్లేందుకు కేసీఆర్‌ ఓకే అంటాడా?

మరో ఆరు నెలల్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.

ఆ ఎన్నికలు అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు బిజెపికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి.

వరుసగా రెండు సార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ( BRS party ) మరో సారి అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాట పడుతుంది.అదే జరిగితే మరో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బిజెపిలకు గడ్డు పరిస్థితి తప్పదు.

ఇక ఎన్నికలు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండగా పొత్తుల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Will There Be Alliance Of Brs With Left Parties , Kcr, Brs, Congress , Cpi, Cpm,

గత సంవత్సరం జరిగిన మునుగోడు( munugodu ) ఉప ఎన్నికల కోసం కామ్రేడ్స్‌ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.అదే పొత్తుని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.కానీ తాజా పరిణామాల నేపథ్యం లో కామ్రేడ్ పార్టీలు( Comrade parties ) కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లాలని ఆశ పడుతున్నాయట.

Advertisement
Will There Be Alliance Of BRS With Left Parties , KCR, Brs, Congress , Cpi, Cpm,

అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి కొన్ని స్థానాల్లో నష్టం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Will There Be Alliance Of Brs With Left Parties , Kcr, Brs, Congress , Cpi, Cpm,

రాజకీయ ఉద్దండుడు అయినా కేసీఆర్( KCR ) ఈ విషయమై ఎలా పావులు కదుపుతాడు అనేది చూడాలి.పెద్దగా బలం లేకపోయినా కూడా తమకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్న కామ్రేడ్ పార్టీలు కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అయినా ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి.కనుక ఆ రెండు పార్టీలను గ్రిప్ లో పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారులు కొందరు సూచిస్తున్నారట.

ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.కానీ కామ్రేడ్ పార్టీ నాయకులు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతూ ఎక్కువ స్థానాలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతుంది.

అది ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి ఎన్నికలు మరో ఆరు నెలల సమయం ఉండగానే పొత్తుల పరంపర మొదలైంది.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ముందు ముందు ఎలాంటి రాజకీయ చిత్ర విచిత్రాలు జరుగుతాయో మనం చూడబోతామో.

Advertisement

తాజా వార్తలు